నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాబాయ్, అబ్బాయిలు.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు మధ్య గ్యాప్ వచ్చిందని.. గత కొంతకాలంగా ఓపెన్ గానే వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ ఈవెంట్‌లో కలిసిన ఈ బాబాయ్, అబ్బాయిలు.. మళ్లీ తర్వాత కలిసి కనిపించిందే లేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొకం, పెడమొకంగా కనిపించడంతో.. ఈ వార్తలు మరింత పుంజుకున్నాయి. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు బాగానే ఉన్నా.. వారితో బాలయ్య సఖ్యతగా ఉండడం లేదని.. దూరం పెట్టారంటూ గుసగుసలు మొదట్లో వినిపించేవి.
అలాగే.. రీసెంట్గా బాలయ్య సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కూడా వీళ్లు హాజరు కాకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి క్రమంలో.. లేటెస్ట్‌గా నందమూరి అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాల్లో కళ్యాణ్ రామ్‌తో పాటు.. విజయశాంతి కీలక పాత్రలో మెరవనున్నారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత విజయశాంతి పోలీస్ రోల్‌లో నటిస్తుండడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తాజాగా సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ పాల్గొని సందడి చేశాడు. ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి.
చిన్నప్పుడు బాబాయ్ బాలయ్యతో కలిసి బాలగోపాలుడు సినిమాలో నటించిన విషయం గుర్తు చేసుకున్న ఆయన.. బాలా బాబాయ్ నుంచే నటనలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని.. బాబాయ్ ఎప్పుడు నాకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన లెగసీని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత మాపై ఉందంటూ ఆయన కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత.. కళ్యాణ్ రామ్ బాలయ్య గురించి మాట్లాడటం నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. అలానే.. విజయశాంతి గారితో మరోసారి కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. గౌరవాన్ని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. కర్తవ్యం సినిమాలో పవర్ ఫుల్ నటనను మళ్ళీ ఈ సినిమా గుర్తు చేస్తుందంటూ వెల్లడించాడు. ఆమె ఎనర్జీ, కమిట్మెంట్.. సెట్స్ లో అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. కర్తవ్యం సినిమాలో ఆమె క్యారెక్టర్ కి కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా అంటూ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అతనొక్కడే సినిమాలాగానే ఈ సినిమా కూడా చాలా కాలం గుర్తుండిపోతుందంటూ కళ్యాణ్ రామ్ వివరించాడు.