టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్గా నిలిచాయి. ఇక బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే.. కచ్చితంగా అఖండకు ముందు.. అఖండకు తర్వాత అనే టాక్ వినిపిస్తుంది. కారణం.. అకండకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్న బాలయ్య.. అఖండతో ఒక్కసారిగా అఖండ విజయాన్ని దక్కించుకుని ఇప్పటివరకు ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరి కాంబోలో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది.
అంతేకాదు.. బాలయ్య సినీ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో హైప్ మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అభిమానులకు పూనకం తెప్పించే విధంగా సినిమా ఇంట్రో సీన్ అదిరిపోనుందని టాక్. ఇప్పటికే అఖండ సినిమాలో అఘోరగా కనిపించిన బాలయ్య.. అదే పాత్ర కంటిన్యూటీగా అఖండ 2 తాండవంలో కనిపించనున్నాడట.
ఇక హిమాలయాల్లో శివలింగం అభిషేకం చేస్తూ పవర్ ఫుల్ రోల్ లో బాలయ్య ఇంట్రడక్షన్ ఉండనుందని సమాచారం. బాలయ్య ఎంట్రీలో వచ్చే విజువల్స్ మొత్తం సినిమాకి హైలెట్ కానున్నాయని తెలుస్తుంది. బాలయ్య ఎంట్రీ టైంలో వచ్చే విజిల్స్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని.. గూస్ బంప్స్ తెప్పించేలా ఆ సీన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోరా రోల్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి, ఆయనతోపాటు టీం.. మొత్తం హిమాలయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇక అకండ 2 తాండవం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై.. రామ్ ఆచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానకగా అఖండ టు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.