భారీ ధరకు నాని హిట్ 3 ఓటీటీ డీల్ లాక్.. ఇది నాచురల్ స్టార్ క్రేజ్..!

నాచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి.. ఇప్పుడు ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పక్కన హీరోగా నటిస్తునే.. మ‌రో పక్క ప్రొడ్యూసర్‌గాను తన సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నాడు నాని. అయితే.. ఆయన సినిమాల సక్సెస్‌కు కథల సెలెక్షన్ కూడా ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాదు.. తాజాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న కోర్ట్‌ సినిమాకు నాని ప్రొడ్యూసర్‌గా మరి కోట్ల లాభాలు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని ఫ్యాన్స్ అందరి దృష్టి హిట్ 3 సినిమా పై పడింది.

హిట్‌ 3` టీజర్‌ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం  లేదు, లింక్‌ ఉండాలి - hit 3 teaser review nani showing reality and also  following animal marco style action in

భారీ యాక్షన్ మూవీ.. డిఫరెంట్ రోల్‌లో నాని కనిపించనన్నాడు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మూవీ హక్కులను అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న హిట్ సినిమాల ఫ్రాంచైజ్‌.. హిట్ 2కు సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో అర్జున్ సర్కార్గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నాని కనిపించనున్నాడు. శైలేష్ కొల‌ను డైరెక్షన్ లో తెర‌కెక్కనున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా మే 1న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా ఓటిటి హక్కులు భారీ ధరకు కొనుగోలు అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ గా మారాయి.

Hit 3 Teaser: ఒరిజిన‌ల్ చూపిస్తా - వ‌య‌లెంట్‌గా నాని హిట్ 3 టీజ‌ర్‌-nani hit  3 movie teaser unveiled on his birthday kgf heroine srinidhi shetty  ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ‌ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్లు చెల్లించి మరి సొంతం చేసుకుందట. ఏకంగా రూ.54 కోట్లకు ఈ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు నాని నిర్మించిన కోర్ట్ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాని నుంచి నెక్స్ట్ రాబోయే హిట్ 3 సినిమా థియేటర్స్ లోను భారీ వసూలను కొల్లగొట్టి సంచలనం క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక‌ నాని ఎంచుకునే కథలపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.