నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి రానున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ విజయశాంతి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్‌గా కీలక పాత్రలో మెరువనుంది. వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఆకట్టుకొనుంది. లేటెస్ట్గా నేడు.. మార్చి 17న అర్జున్ సన్నాఫ్ విజయశాంతి మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను ఆసక్తికరంగా ఇంటర్డ్యూస్ చేశారు. ఇద్దరు పాత్రల్లో డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
10 సంవత్సరాల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో పోలీస్ ఆపరేషన్స్. కానీ.. చావుకు ఎదురు వెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ దే.. అంటూ విజయశాంతి పవర్ఫుల్ డైలాగ్ తో పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నెక్స్ట్ బర్త్‌డేకి నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదేనంటూ విజయశాంతి కొడుకు అర్జున్‌కు పోలీస్ డ్రస్‌ను అందిస్తుంది వైజయంతి. అయితే అర్జున్ పోలీస్ ఆఫీసర్ కాకుండా డాన్‌గా కనిపించనున్నట్లు టీజర్‌ను బట్టి క్లారిటీ వచ్చింది.
ఇక ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్న నటుడు పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ సినిమాలో అసలైన ట్విస్ట్. ఆడియన్స్‌ను ఆలోచింపచేసేలా ఆ డైలాగుంది. సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా.. చచ్చిపోయిందా అంటూ పృధ్వీరాజ్ చెప్పిన డైలాగ్స్ లో నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆసక్తిని పెంచింది. రేపటి నుంచి వైజాగ్ ను పోలీసులు, నల్లకోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాధ్ కనుసైగలు శాసిస్తాయి అంటూ కళ్యాణ్ రామ్ ఊరమాస్ డైలాగ్‌తో మాస్ ఎంట్రీ ఆకట్టుకుంది. అసలు ఇంతకీ అర్జున్ తల్లి మాట కోసం పోలీసులా మారడా.. లేదా పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్‌లా మారడా అనే సస్బెండ్స్ అందరిలోనూ నెలకొన్నాయి.