సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న నటులను.. నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో చూపించాలంటే దర్శకులు చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి సాహసం చేయడానికి దర్శకుడు ఇష్టపడరు సరి కదా.. హీరోలు కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. దానికి కారణం ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అలాంటి పాత్రలో నటిస్తే యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. డైరెక్టర్ పై కన్నెరచేస్తారేమో అని భయం ఉంటుంది. పరిముఖ్యంగా కొంతమంది స్టార్ దర్శకులు.. స్పెషల్ కథలను రాసుకునే సమయంలో ఆ కథలో కొన్ని నెగటివ్ షేడ్స్‌లో హీరోలను చూపించాల్సి వచ్చిన సమయంలో కూడా భయపడిపోతూ ఉంటారు.
ఆ లిస్టులోకే డైరెక్టర్ బావి కూడా వస్తాడు. రీసెంట్‌గా నందమూరి నటసింహం బాలయ్యకు.. డాకు మహారాజ్‌తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన బాబి.. గతంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాని తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్లో నటించగా.. ఒక క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఆ క్యారెక్టర్ కోసం మొదట రామ్ చరణ్‌ను అనుకున్నాడట బాబి. రామ్ చరణ్‌కు కధ వినిపించగా.. చరణ్ ఫ్యాన్స్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తే ఊరుకుంటారో.. లేదో.. అన్ని భయంతో ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. బాబి కూడా దీంతో వెనకడుగు వేసినట్లు టాక్.
నిజానికి ఎన్టీఆర్‌తో స్టోరీ చెప్పే టైంలో కూడా.. ఎన్టీఆర్ అలాగే సమాధానం ఇచ్చాడట. కానీ.. ఆయన తన లైఫ్‌లో అన్ని వైవిధ్యమైన పాత్రల్లో చేయడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే జై లవ కుశ లో నెగిటివ్ షేడ్స్‌లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం నెగటివ్ షేడ్స్‌లో కనిపించాల్సిన ఈ పాత్రను అనవసరంగా మిస్ చేసుకున్నాడని.. జై లవకుశ సినిమాలో చరణ్ నటించి ఉంటే ఆయన పాపులారిటీ మరింతగా పెరిగేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతుంటే చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకునేందుకు కష్టపడుతున్నారు.