ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్ద‌రు సక్సెస్ కొడతారా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్‌ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ తమిళ్ డైరెక్టర్ లపై ఫోకస్ పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు తెలుగు హీరోలకు తమిళ డైరెక్ట‌ర్లు హిట్లు ఇచ్చిన సందర్భాలు చాలా రేర్‌.

Nelson Dilipkumar To Team With NTR | cinejosh.com

ఇలాంటి నేపథ్యంలో.. అటు ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇటు అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఈ టాలీవుడ్ హీరోలకు ఏ రేంజ్ లో హిట్ ఇస్తారని చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బన్నీ, తారక్ ఇద్దరు ఒకే బాటలో పయనిస్తున్న క్రమంలో.. ఇద్దరు హీరోలకు ఆ తమిళ్ డైరెక్టర్లు కెరీర్ పరంగా సక్సెస్‌లు అందించగలరా.. లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ కచ్చితంగా ఫ్యూచ‌ర్‌ ప్రాజెక్టులతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అనుకోవడం ఖాయం అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Atlee & Allu Arjun Combo - Not anytime soon | Atlee & Allu Arjun Combo -  Not anytime soon

పక్కా ప్లాన్ తో వెళ్తున్నారని.. ప్రతి సినిమా విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు తగ్గట్టుగా లుక్స్ మారుస్తూ చాలా కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బన్నీ కూడా మరోపక్క రెండు సినిమాలలో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఎంచుకున్న ఈ దారిలో.. తమిళ్ డైరెక్టర్ లతో సినిమాలు నటించి సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.