టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ఆర్ సి 16. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. చివరిగా నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో.. ఈ సినిమాపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఇప్పటికే ఆర్సి16పై టాలీవుడ్ ఆడియన్స్‌లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేక మైలురాయిగా ఈ సినిమా నిలవనుందట. ముఖ్యంగా.. ఈ సినిమాలో చరణ్ పాత్ర అలాంటిదని.. ఇప్పటివరకు ఎవ్వరూ చేయని వైవిధ్యమైన పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడని చెబుతున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక టాలెంటెడ్ అథ్లెటిక్ గా కనిపించనున్నాడట చరణ్.
బుచ్చిబాబు కథనం ప్రకారం.. ఓ గ్రామీణ ప్రాంత యువకుడు అతని కృషి, పట్టుదలతో రాష్ట్రస్థాయిలో ఎలా టాలెంట్ చాటుకున్నాడు. జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు అనే అంశంపై సినిమా రూపొందనుందని తెలుస్తుంది. ఇక ఏ ఆట అంటే.. ఏ ఆట అయినా సరే ఆడగలుగుతాడట చరణ్. క్రికెట్, కబడ్డీ, కుస్తీ ఇలా ఈ మూడు ఆటలతో రామ్ చరణ్ తన టాలెంట్ ను చూపిస్తాడని.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే చరణ్ స్వయంగా కాకుండా.. ఎవరికి అవసరం వచ్చినా అద్దెకు వెళ్లే ఆటగాడిగా కనిపించనున్నాడని సమాచారం. మీడియా సమాచారం ప్రకారం ఐపీఎల్లో ఆటగాళ్లని ఎలా కొనుక్కుంటారో.. అలా కొంతమందిని కొనుక్కొని ఓ జట్టుగా తయారు చేసి గేమ్ ఆడిస్తూ ఉంటారు. ఆడినందుకు రోజుకు ఇంత డబ్బులు అని ఇస్తూ ఉంటారు. అలా సినిమాలో హీరో కూడా అద్దె ఆటగాడుగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే క్రికెట్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు పూర్తి చేశారు టీం. చరణ్ పాత్ర ఈ కథలో చాలా స్పెషల్ గా ఉండనుందని.. ఈ పాత్ర కోసం ఆయన బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో నిజమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. ఉప్పెన లో ప్రేమ, తల్లిదండ్రుల బాండింగ్, సామాజిక సమస్యలు ఇలా ఆడియన్స్‌ను హత్తుకునేలా ఎమోషన్స్ చూపించిన బుచ్చిబాబు.. ఆర్సి16లో స్పోర్ట్స్ డ్రామాకు అదే లెవెల్ ఎమోషన్స్ చూపించనున్నారని తెలుస్తుంది. కేవలం గేమ్ బెస్ట్ కంటెంట్ కాదు.. అథ్లెట్గా ఎదుగుదల వెనుక ఉన్న స్ట్రగుల్స్, కష్టాలు కూడా కళ్ళకి కట్టినట్లు చూపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరింత ప్లస్ కానుంది. స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాకు మ్యూజిక్ చాలా మెయిన్. అదే రేంజ్ లో రెహమాన్ ప్లాన్ చేస్తున్నాడని.. అలాగే విజువల్స్ విషయంలోనూ అద్భుతమైన సరికొత్త సినిమాతోగ్రఫీ ని వాడనున్నట్లు సమాచారం.