1500 సార్లు టీవీ టెలికాస్ట్.. మాస్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ క్రేజీ మూవీ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి చాలామంది కష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ అందరికీ తెలుసు. బాలన‌టుడిగా అడుగుపెట్టిన ఆయన.. ప్రస్తుతం హీరోగా వరుస‌ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

Athadu - Wikipedia

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇకపోతే.. మహేష్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం సెకండ్ స్కెడ్యూల్ ఒడిశాలో జరుగుతుంది. ఈ క్ర‌మంలోనే మహేష్ బాబుకు సంబంధించిన మాస్ రికార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహేష్ బాబు నటించిన ఓ సినిమా ఇప్పటికీ 1500 సార్లు బుల్లితెరపై ప్రసారం కాగా.. ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాని ఆదరిస్తూనే ఉన్నారు అంటూ క్లారిటీగా వెల్లడించింది. ఇక అంతలా క్రేజ్, పాపులారిటి దక్కించుకున్న ఆ సినిమా ఏదో ఒక‌సారి చూద్దాం.

Athadu | Cinema Chaat

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన అతడు. ఈ సినిమాకి నంది అవార్డు, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు కూడా దక్కాయి. కాగా.. ఈ సినిమా స్టార్ మాలో ఇప్పటికీ ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు.. స్టార్ మాలో ఇప్పటివరకు 1000 సార్లకు మించి ఏ సినిమా ప్రసారం కాలేదు. అలాంటిది.. అతడు సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో 2005లో తెర‌కెక్కిన అన్ని సినిమాలకంటే.. ఈ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీగా నిలవడం మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే హిందీ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్ అయి మంచి సక్సెస్ అందుకుంది.