కోర్ట్.. 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్ల లెక్కలివే.. నాని పై కాసుల వర్షం..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రించిన‌ తాజా మూవీ కోర్ట్.. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని.. లేదంటే హిట్ 3 థియేటర్స్ లో చూడొద్దంటూ నాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఛాలెంజ్ చేసి మరి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా పై విమర్శకుల ప్రశంసల సైతం ద‌క్కుతున్నాయి. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మొదటి రోజు సినిమాకి దాదాపు kp.8 కోట్ల వసూళ్ల రాగ.. గతంలో నాని నటించిన సినిమాలకు సైతం ఈ రేంజ్ క‌లెక్ష‌న్‌లు వచ్చేవి కావు. ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేని అతి చిన్న ఆర్టిస్ట్ ను హీరో, హీరోయిన్‌లుగా పెట్టి నాని ఈ రేంజ్‌ సక్సెస్ అందుకోవడం అంటే గొప్ప విషయమే.

ఇకపోతే ఈ సినిమాలో శివాజీ నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలోనూ శివాజీ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టిందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ట్రెడ్‌ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మూడో రోజులో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3 కోట్లు రాగా.. వరల్డ్ వైడ్‌గా రూ.4 కోట్ల షేర్ వ‌సూళ్లు దక్కినట్లు తెలుస్తుంది. మొదటి రోజు కంటే మూడో రోజు మరింత షేర్ వ‌సూళ్లు రావడం విశేషం. ఇక రెండో రోజు బ్రేకింగ్ మార్క్ను క్రాస్ చేసిన ఈ సినిమా.. ప్రాంతాలవారీగా ఏ రేంజ్ లో వసూళ్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Court Collection Day 1: రికార్డ్ ఓపెనింగ్స్ కొట్టిన ప్రియదర్శి.. నాని  మూవీకి ఎన్ని కోట్లంటే? | Natural Star Nani Priyadarshi's Court Day 1 Box  Office Collections Worldwide - Telugu Filmibeat

నైజం లో రూ.4.65 కోట్లు, సీడెడ్ లో రూ.55 లక్షలు, ఆంధ్రాలో రూ.3.41 కోట్లు షేర్ వ‌సూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన కోర్ట్.. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కలిపి రూ. 8.61 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను దక్కించుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే రూ.80 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ కర్ణాటకలో రూ.60 లక్షలు.. ఇలా ఓవరాల్‌గా రూ.12 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. రిలీజ్ కు ముందు ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తోనే రూ.7 కోట్లు రాబట్టిన నాని.. ఇప్పటివరకు రూ.5 కోట్లకు పైగా లాభాలను దక్కించుకున్నాడు. ఇక ఫుల్ రన్‌లో మరో రూ.10 కోట్ల సులువుగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న క్రమంలో.. నాని పై కాసుల వర్షం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.