టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మొదటి నుంచి బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ. తండ్రి కంటే చరణ్ కు ఎక్కువగా బాబాయ్ అంటేనే ఇష్టం. పవన్ వెళ్లే విధానాన్ని ఆయన ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు మొండి పట్టుదల ఎక్కువని.. తను అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడంటూ.. ఎంత కఠినమైన దానికోసం కష్టపడి చేస్తాడని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌ను రామ్ చరణ్ ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇలాంటి క్రమంలోనే.. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రస్తుతం రామ్ చరణ్ ఫాలో అవుతున్నారంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. పవర్ స్టార్ పవన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
ఆయన సినిమాల్లో కొన్ని డైలాగ్స్ ఎప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. యంగ్ ఏజ్ వాళ్లకు మరింతగా కనెక్ట్ అవుతాయి. అలా యూత్ కు బాగా కనెక్ట్ అయిన డైలాగ్స్ లో.. నేను ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తా అనే డైలాగ్ కూడా ఒకటి. ఇక ప్రస్తుతం ఇదే డైలాగ్ ను చరణ్ ఫాలో అవుతున్నాడు. అందరిలా ట్రెండ్ ఫాలో కాకుండా.. నేను ట్రెండ్ సెట్ చేస్తానంటూ ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుని దానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇంతకీ రామ్ చరణ్ తీసుకున్న సెన్సేషనల్ డెసిషన్ ఏంటి.. ఏం చేయబోతున్నాడు.. ఒకసారి చూద్దాం. చరణ్, రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అందరు హీరోలాగే ఆయన డబుల్ రెమ్యునరేషన్ అందుకోవాలి. కానీ.. చరణ్ మాత్రం అలా చేయడం లేదు. ఆర్ఆర్ తర్వాత వచ్చిన రెండు సినిమాల రిజల్ట్ తేడాగా ఉండడంతో.. ఆ రెండు సినిమాలకు అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న చరణ్.. తన నుంచి నెక్స్ట్ రానున్న ఈరన్ సి 16 సినిమాకు కూడా.. ఆయన అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ మంచితనం అది అంటూ మెగా ఫ్యాన్స్ అభినందనలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో విధంగా ట్రెండ్ సెట్ చేస్తారు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకునే విధంగా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్‌చరణ్ రెమయ్యునరేషన్ లెక్కలు తెగ వైరల్ గా మారుతున్నాయి.