టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక గతేడాది నవంబర్లో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ నవంబర్‌లో మైసూర్‌లో పూర్తయింది. ఇటీవల టీం సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాదులో ఫినిష్ చేశారు.
మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకుని రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక మూవీ అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. భారీ లెవెల్ హైటెక్నికల్ వాల్యూస్‌తో అసలు ఎక్కడ తగ్గకుండా రూపొందిస్తున్నారు టీం. ఈ క్రమంలోనే సినిమాలో భారీ తారాగణం నటించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఏమన్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ రోల్‌లో మెరువనున్నారు. ఇటీవల మూవీ టీమ్ శివన్న లుక్స్ టెస్ట్ పూర్తి చేశారు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పాల్గొననున్నాడు శివన్న. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. అదేంటంటే ఈ సినిమాల్లో మరో కన్నడ దివంగత నటుడు.. స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య కూడా కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ కెమెరామ్యాన్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాను వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమా కోసం మైత్రి మేకర్స్ ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.