స్టార్ హీరోయిన్ సమంత దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజా రీ ఎంట్రీ లోను పలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో మాత్రమే నటించిన సామ్.. తన సొంత బ్యానర్ ట్రలాలా ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా తన ప్రతిభను చూపించనుంది. ఈ క్రమంలోనే మొదటి ప్రొడక్షన్‌లో శుభం టైటిల్తో సినిమాను పూర్తి చేస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి సమంత ప్రొడ్యూసర్ కావడంతో ఆడియన్స్ లో మరింత హైప్ నెలకొంది. ఇక టైటిల్ కూడా శుభం కావడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. కాగా.. సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాను భారీ లెవెల్‌లో రిలీజ్ చేయనుందట.
ఈ క్రమంలో.. శుభం సినిమా పోస్టర్ రిలీజ్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతూ శుభం పోస్టర్ స్టేటస్ లో షేర్ చేశారు మైత్రి మేకర్స్ వారు. దీంతో తమ ఫేవరెట్ బ్యూటి ఫస్ట్ ప్రొడక్షన్ మూవీకి మైత్రి సపోర్ట్ ఇవ్వడంపై ఆనందాని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపధ్యంలోనే.. సమంత మొదటి సినిమా మైత్రి వారి ద్వారా రిలీజ్ చేస్తుందని అంత భావిస్తున్నారు. లూకింగ్ ఫార్వర్డ్ అంటూ మైత్రి మేకర్ మెసేజ్ పెట్టడం చూస్తే.. నిజంగానే సమంత శుభం సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్లో తర్కెక్కనున్న ఈ సినిమాల్లో అందరూ యంగ్ యాక్టర్స్ మెరవనున్నారు. ఇక కంటెంట్ బాగుంటే అందులో ఉన్నది ఎవరైనా తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనడంలో సందేహం లేదు.
అలా.. సమంత శుభం సినిమాకు కొత్త నటులనే ఫీల్ ఉండకపోవచ్చు. అదికాక.. సమంత నిర్మాణంలో వస్తున్న మొదటి సినిమా కనుక ఆమె కూడా ఈ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా మైత్రి మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ లోనే సమంత శుభం సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా తెలియదు కానీ సమంత మొదటి సినిమాకు మైత్రి సపోర్ట్ మాత్రం ఉందన్నది క్లారిటీగా తెలుస్తుంది. సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. తెలుగులో చాన్సులు వస్తున్న రిజెక్ట్ చేస్తుందని సమాచారం. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఇక సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా ప్రొడక్షన్‌పై మా ఇంటి బంగారు అంటూ సినిమా పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.