టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ప్రస్తుతం అనేక వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు. ఓ పక్కన పర్సనల్ విషయాలతో పాటు.. ఇటీవల వచ్చిన ఫ్లాపుల విషయంలోను కూడా ఆయన బాగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ రైట్స్ తో ఆయనకు మరింత డిస్టబెన్స్ కలిగిందట. ఇలాంటి క్రమంలో ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ తిలరాజు గురించి ఒక సెన్సిటివ్ కదనాన్ని ప్రచురించడంతో ఆయనకు బాగా కోపం వచ్చినట్లు టాక్ నడుస్తుంది. సాధారణంగా రూమర్స్ ఎన్ని వచ్చినా దిల్ రాజు పట్టించుకోడు. ఒకవేళ దేనికైనా హర్ట్ అయినా.. లిమిట్స్ క్రాస్ అయినట్లు అనిపించిన.. వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేస్తాడు. హెచ్చరిస్తాడు.
కాగా ఇటీవల గేమ్ ఛస్త్రంజర్ సినిమా పెద్ద మొత్తంలో నష్టాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కొట్టడంతో ఆయన ఆ నష్టాల నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే దిల్ రాజు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి, పేమెంట్స్‌కు సంబంధించిన ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. వెబ్ పోర్టల్ మరో అడుగు ముందుకు వేసి ఆర్టికల్‌ను మరింత ఘాటుగా ప్రచురించడంతో.. దిల్ రాజుకు కోపం వచ్చిందని.. దీనిపై స్పందించేందుకు ఇమీడియట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు వెబ్ పోర్టల్ వెంటనే.. ఆ కథనాన్ని డిలీట్ చేసింది. మళ్ళీ ఏం జరిగిందో ప్రెస్ మీట్ కూడా అనూహ్యంగా రద్దయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మిస్టేరియస్ గా మారింది.
దిల్ రాజు తన వ్యక్తిగత లైఫ్ ని బయట పెట్టడానికి ఇష్టపడడు. అలాంటి దిల్ రాజు పై ఈ స్థాయిలో ఆరోపణలు రావడం ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా లీక్ అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆయన ఆ ప్రముఖ వెబ్ పోర్టల్‌పై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కలిసి పని చేసిన కొందరు ఈ లీకులకు కారణమని సమాచారం. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇలాంటి సమయంలో దిల్ రాజు అసలు తడపడకుండా తన ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళుతున్నాడట. ఇక గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తో దెబ్బ తిన్న.. దిల్‌రాజు మళ్ళీ పెద్ద సినిమాలు చేయరని అంతా భావించారు. కానీ.. ఆయన మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రభాస్ తో భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇంతకు ఈ లేనిపోని కథనాలు, లీక్స్ అసలు సూత్రధారి ఎవరు.. కావాలనే ఇదంతా చేస్తున్నారా.. అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. భవిష్యత్తులో దిల్ రాజు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో.. లేదా.. దీనిని ఇంతటితో వదిలేస్తారో వేచి చూడాలి.