మహేష్ బాబు ముందుచూపు.. ఆయన‌ను ముంచేసేలా ఉందే..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్‌.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్‌, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైన‌ప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్న‌ట్లు సమాచారం. ఇక చరణ్‌.. బుచ్చి బాబు సన్నాతో ఆర్సి16, సుకుమార్ డైరెక్షన్లో ఆర్సి 17 సినిమాలను లైన్లో ఉంచుకున్నాడు. ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయనున్నట్లు టాక్. బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లిస్టులో ఉందట. ఇక పుష్ప 2తో సాలిడ్ హిట్ కొట్టిన బన్నీ.. త్రివిక్రమ్ తో పాటు అట్లీతోను నెక్స్ట్ ప్రాజెక్ట్లను సిద్ధం చేసుకున్నాడు. దీంతో పాటు ఆయన లైనప్‌లో పుష్ప 3 ఉంది. ప్రభాస్ అయితే దాదాపు అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

BollywoodMDB Poll Results: Jr. NTR BEATS Ram Charan, Allu Arjun And Prabhas!

అలాగే హేంబ‌లే ప్రొడక్షన్లో మరో రెండు సినిమాలతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇలాంటి క్రమంలో బిగ్ లీగ్‌లో ఉన్న స్టార్ హీరోస్తో పోలిస్తే.. మహేష్ బాబు లైనప్‌ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్ద టాస్క్. సాధారణంగానే జక్కన్నతో సినిమా చేసిన ప్రతి హీరోకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇలానే ఉంటుంది. ఆయనతో సినిమా వస్తే ఇమేజ్, స్టాండర్డ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారనుకుంటే పొరపాటే. ఆయన ప్లానింగ్ మొదటి నుంచి ప్రశ్నార్ధకమే. తన నుంచి ఓ సినిమా వచ్చి.. ఆ సినిమా రిజల్ట్ వచ్చిన కొద్ది గ్యాప్ తర్వాతే నెక్స్ట్ డైరెక్టర్ తో కథ వినడం.. ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చేస్తారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టును సెట్ చేసుకునే చొరవ మాత్రం ఎప్పుడూ చూపించడు. ఇక రాజమౌళి తర్వాత మహేష్ సినిమా ఏమిటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.

SSMB 29 launch: SS Rajamouli's film with Mahesh Babu kicks off with pooja  amid confusion over Priyanka Chopra's casting - Hindustan Times

ఏదేమైనా 2026 నాటికి ssmb 29 సినిమా రిలీజ్ అవుతుందని పక్కాగా టాక్‌ నడుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు.. ఎలాంటి ప్రాజెక్టులో నటిస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. సినిమా రిలీజై.. రిజల్ట్ వ‌చ్చిన‌ తర్వాత తిరిగా ఆలోచించే రోజులు అసలు కానే కావు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ అంతా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ ఈ లీగ్ లో మంచి లైనప్‌ను సెట్ చేసుకున్నారు. మరి మహేష్ తో సినిమా చేయదగ్గ రేంజ్ ఉన్న డైరెక్టర్స్ అంతా ఇప్పటికే ఇతర స్టార్ హీరోల లీగ్ లో సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో మహేష్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని.. ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే కానీ సమయం కలిసిరాదు. అలా కాదని ముందు చూపుగా ఆలోచించి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టుకోకుంటే ఆయనకు అది పెద్ద దెబ్బ అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మహేష్ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉందో వేచి చూడాలి.