సౌందర్యను మోహన్ బాబే చంపించాడు.. సాక్ష్యం నేనే.. చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే సౌందర్య పేరు టక్కున వినిపిస్తుంది. కట్టుబొట్టు, సాంప్రదాయంతోనే కాదు.. అందం, అభినయంతోను తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది సౌందర్య. ఇక టాలీవుడ్‌లో వెంకటేష్, జగపతిబాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి తన స్టామినా నిరూపించుకుంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే మోహన్ బాబు కమెడియన్‌గా కొనసాగుతున్న క్రమంలోనూ ఆయనతో పలు సినిమాల్లో నటించింది. ఇక వీరిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో.. వీరి మధ్య బాండింగ్ కూడా అలానే ఉండేదట.

Mohan Babu could have saved Soundarya | cinejosh.com

ఇక ఈ అమ్మ‌డి కెరీర్‌ పిక్స్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల సందర్భంగా బిజెపికి మద్దతు తెలిపేందుకు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ జట్లో ప్రయాణం చేస్తుండగా.. హెలికాప్టర్ బ్లాస్ట్ అయి మరణించింది. 2004 ఏప్రిల్ 17న ఈమె తుది శ్వాస విడిచింది. ఇక సౌందర్య మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. అయితే.. తాజాగా సౌందర్య మర‌ణానికి మోహన్ బాబు కారణమని.. మోహన్ బాబు సౌందర్యను చంపేసాడంటూ చిట్టిబాబు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేశాడు. మోహన్ బాబు పై ఖమ్మం రూరల్ ఎస్పీకి చిట్టిబాబు ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు వల్ల తనకు కూడా ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను కోరాడు.

ఇక అప్పట్లో సౌందర్యకు శంషాబాద్ జల్‌పల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉండేదని.. దాన్ని అమ్మమని మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడ‌ని అదే విష‌యం సౌంద‌ర్య ఆయ‌న‌తో చెప్ప‌డంతో వారిపై కోపాన్ని పెంచుకున్న మోహన్ బాబు.. బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న క్రమంలో.. సాక్షాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంగా చిత్రించి హత్య చేయించాడని చిట్టిబాబు షాకింగ్ ఆరోపణలు చేశాడు. అంతేకాదు మంచి టౌన్ లో ఉన్న ఈ గెస్ట్ హౌస్‌ను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు అంటూ పేర్కొన్నాడు. మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలంటే చిట్టిబాబు ఈ ఫిర్యాదులో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త‌లు వైరల్ గా మారడంతో అసలు చిట్టిబాబు ఎవరు.. ఇంత కాలానికి ఎందుకు బయటకు వచ్చారు.. ఇప్పటివరకు ఏం చేశాడు.. ఈయనకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు.. అని నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీనిపై మోహన్ బాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.