స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు.. తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో విపరీతంగా క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకున్నా.. కుర్రాళ్లకు మాత్రం హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. మత్తెక్కించే చూపులతో.. డస్కీ స్కిన్ టోన్ తో.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ఊరిస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెంచుకుంది. అలా పలు క్రేజీ ప్రాజెక్టుల అవకాశాలు దక్కించుకుంది. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోపాటు.. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాలు కూడా ఉన్నాయి.
పవన్, ప్రభాస్ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఇక ప్రభాస్ అయితే నేషనల్ లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌ను దక్కించుకున్నాడో తెలిసిందే. అలాంటి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టి.. వారితో నటించడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతోమంది పెద్దపెద్ద బ్లాక్ బస్టర్లు అందుకున్న ముద్దుగుమ్మలు సైతం వీరితో కలిసి నటించాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి అదృష్టం నిధి అగర్వాల్‌కు దక్కింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్ దెయ్యం పాత్రలో కనిపించనుంది అంటూ కొన్ని వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై రియాక్ట్ అయిన ఆమె.. రాజాసాబ్‌లో నేను దెయ్యం పాత్రలో నటించడం లేదని.. కానీ నేను నటించే పాత్ర అందరిని ఆశ్చర్యపరిచేలా.. ఆకట్టుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ సెట్స్‌లో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తారని.. ఎంతో జోయల్ గా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.