ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత తన ప్రతి సినిమా విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు తారక్. మార్కెట్ను మరింత పెంచుకునే దిశగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం.. తారక్ పూర్తిస్థాయి బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత చేరువ కావాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆగస్ట్‌లో వార్ 2 సినిమా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ మరో సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమాకు ఆల్మోస్ట్ డ్రాగన్ టైటిల్ కరారు అయ్యింది. ఇదిలా ఉంటే.. రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరో స్టార్ డైరెక్టర్ తో పనిచేయని సిద్ధం అవుతున్నాడంటూ.. ఓ ఆసక్తికర అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. డ్రాగెన్ తర్వాత.. తమిళ్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్‌లో తారక్ ఈ సినిమా చేయనున్నాడట. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యేలా రాక్ అనే టైటిల్‌ను నెల్సన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని నెల్సన్ ఈ టైటిల్‌తో సినిమాను ప్లాన్ చేశాడట. ఇక తారక్.. డ్రాగన్ సినిమా, నెల్సన్.. జైలర్ 2 సినిమాలు పూర్తయిన వెంటనే.. రాక్ సినిమా సెట్స్‌పైకి వస్తుందని సమాచారం. దాదాపు 2026లో సినిమా ప్రారంభం అవ్వచ్చు. సీతారామ ఎంటర్టైన్మెంట్స్.. సూర్యదేవర నాగావంశీ సినిమాకు ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.