ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభిత ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతుంది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడమే దీనికి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. నాగ చైతన్య హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడి కొంతకాలం రహస్య ప్రేమాయణం తర్వాత వారి ప్రేమను ఎంగేజ్మెంట్‌తో అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. మరి కొంతకాలానికే.. ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం చేసుకొని ఒకటయ్యారు. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్దంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సమంత చేసిన తప్పు శోభిత రిపీట్ చేయదని.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ చైతు బిజినెస్, పర్సనల్ విషయాలను చూసుకుంటుందని అంత భావించారు.
కానీ సినిమాల విషయంలో మాత్రం అసలు తగ్గే ఆలోచన లేదని ఇటీవల శోభిత క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా ఆమె కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాతో పట్టే.. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో శోభిత నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అక్కినేని కోడలు పిల్ల.. మెగా హీరోతో రొమాన్స్ ఏంటి అంటూ.. అది కూడా వరుణ్ తేజ్ లాంటి హీరోతో శోభిత సినిమా అంటే అది అసలు వర్కౌట్ కాదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మరి కొంత మంది మాత్రం శోభిత, వరుణ్ తేజ్ పేయిర్ చూసేందుకు బాగుంటుందని.. ఈ సినిమాలో వాళ్ళు కలిసి నటించడంలో తప్పు లేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతంలో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత.. రామ్ చరణ్ కి జోడిగా సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే అప్పుడు సమంత మెగా హీరో చరణ్తో నటించగా.. ఇప్పుడు కొత్త కోడలు శోభిత మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.