టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న చందన ప్రస్తుతం వీళ్ళ కథ నడుస్తుంది. ఇక తారక్ బాబాయ్ బాలయ్య అన్‌స్టాపబుల్ షో కోసం ఇప్పటికే చిన్న, పెద్ద ,స్టార్ హీరో, మీడియం రేంజ్ హీరో అని తేడా లేకుండా ఇప్పటికే ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి తమ సినిమాలు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ.. ఎన్టీఆర్ను మాత్రం ఇప్పటివరకు దగ్గరికి కూడా రానీలేదు. నిజానికి లోకేష్ ఎన్టీఆర్ కు మధ్య భేదాలు వచ్చాయని.. బాలయ్యకు, ఎన్టీఆర్కు కాదని.. అవి బాలయ్యకు కూడా విభేదాలలా తర్వాత మారాయి ఇన్సైడ్ వర్గాల టాక్. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రాజమౌళి సపోర్ట్ లేకుండా పాన్ ఇండియన్ హీరోగా ఎదిగిన ఏకైక టాలీవుడ్ హీరో. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప రాజ్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. మెగా హీరోలకు దూరం అవడం చూస్తూనే ఉన్నాం. మిగతా మెగా హీరోలు ఎవరు ఆయన్ను పలకరించరు. అలా.. ప్రస్తుతం బాలయ్య నోట ఎన్టీఆర్ పేరు, చిరు నోట బన్నీ పేరు మాత్రం రావడం లేదు.
ఇప్పటికే తన ఎచీవ్మెంట్ అంతా చరణ్ పవన్ అంటూ చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ.. బన్నీ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అంటే బన్నీ ఆయన గెలుపు కాదని చెప్పకనే చెప్పారు. ఇక బన్నీ.. అల్లు అరవింద్ ఎచీవ్‌మెంట్ అని అనుకోవాలి. ఇక ఎంత దూరం చుట్టాలైన.. ఓ రేంజ్ కు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటే మా చుట్టం, మా బంధువు అని అంత చెప్పుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ.. ఎన్టీఆర్, బన్నీ ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నా అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీలు మాత్రం వాడు మా వాడని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్లుగా ఎరిగిన తారక్, బన్నీ ఇద్దరు పరిస్థితి ఒకేలా మారింది. అయితే దీనికి కారణాలు తమను మించి.. తమ వారిని మించి.. ఈ హీరోలు ఎదగడం అని.. వారిపై అసూయాన్ని.. ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.