సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు కనిపించిన.. అది పెద్ద ఇష్యూ గా మారిపోతుంది. అది కచ్చితంగా తమ కెరర్ కు ఇబ్బందిగా మారుతుందనే భయంతో సెలబ్రిటీస్ అంతా అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడరు.
చాలా విషయాలను ప్రైవేటుగా ఉంచాలని భావిస్తారు. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వీళ్లందరిలో విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ అంటూ టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు స్టేజ్ పైనే మాట్లాడే హీరోలు చాలా తక్కువగా ఉంటారు.. అందులో మొదటి వరుసలో సీనియర్ హీరో బాలయ్య ఉంటారు. కోపం వచ్చిన, సంతోషం వచ్చినా అంతా స్టేజిపైనే భయపడకుండా చెప్పేస్తాడు.. చూపిస్తాడు.
అలా బాలయ్య తర్వాత ఇండస్ట్రీలో అంతే ఓపెన్ గా మాట్లాడే క్వాలిటీ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండనే అంటూ ఆయన కూడా మైండ్‌లో ఏది ఉన్నా చాలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు రియాక్ట్ అవుతాడు.. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ స్టెప్స్ పై పడిపోతున్న మూమెంట్ వీడియో.. ఇది వైరల్ కివడంతో తెగ ట్రోల్స్ చేశారు జనం. అయితే వాళ్లందరికీ స్ట్రైట్ గానే విజయ్ దేవరకొండ మరో ఫోటోతో కౌంటర్ ఇచ్చేశాడు. అంతేకాదు గతంలోనూ విజయ్ దేవరకొండ ఎన్నో విషయాలపై స్ట్రైట్ కౌంటర్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇండస్ట్రీలో బాలయ్య తర్వాత.. అంటే ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చూపించే చెప్పే హీరో మాత్రం విజయ్ దేవరకొండ అని అంటూ ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.