నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందంటూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు అసలు పడటం లేదంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మధ్యన గ్యాప్ ప్రేక్షకులకు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తారక్ దానిపై కనీసం రియాక్ట్ కాకపోవడం.. చంద్రబాబును చూడడానికి కూడా వెళ్లకపోవడంతో.. ఈ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇలాంటి క్రమంలో బాలయ్య హోస్ట్గా ఉన్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకూడదని జాగ్రత్తలు పడుతున్నాడని.. ఆ విషయాన్ని ఆహా మేకర్స్ కు కూడా ముందే వివరించాడని టాక్ నడుస్తుంది. తాజాగా డైరెక్టర్ బాబీ.. డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో అన్ స్టాపబుల్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తను చేసిన అన్ని సినిమాల గురించి ఆ సినిమాల హీరోలు చిరు, వెంకి ,రవితేజ, పవన్ కళ్యాణ్ తో సహా అందరి గురించి బాలకృష్ణ బాబీని ఒక మాటలో చెప్పాలని అడిగారు. కానీ.. ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం రాలేదు. కాగా బాబి మొట్టమొదట బ్లాక్ బస్టర్ హిట్ జై లవకుశ ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రస్తావనను ఎపిసోడ్ నుంచి ఎడిటింగ్ లో కట్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై ప్రొడ్యూసర్ నాగ వంశీ రియాక్ట్ అయ్యారు. బాబి, బాలయ్య తో పాటు ఈ ఎపిసోడ్లో నాగ వంశీ కూడా సందడి చేశారు. ఆయన దీనిపై రియాక్ట్ అవుతూ.. ఎన్టీఆర్ గురించి టాపిక్ కట్ చేశారని వార్తల్లో నిజం లేదని.. అసలు షోలో ఎన్టీఆర్ పేరు రాలేదని క్లారిటీ ఇచ్చాడు.
ఎడిటింగ్లో ఎన్టీఆర్ ప్రస్తావన కట్ చేశారన్నది అవాస్తవం అంటూ వివరించిన ఆయన.. గతంలో ఓ సమయంలో మూవీ గురించి బాలయ్యతో చర్చిస్తున్న క్రమంలో ఈ పాత్రకి ఎన్టీఆర్ అయితే సెట్ అవుతారని స్వయంగా ఆయన వివరించారని.. కానీ అది షోలో కాదు, షోలో ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం రాలేదు అంటూ వెల్లడించారు. అయితే బయట మాత్రం అన్‌స్టాపబుల్‌షోలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరూ మాట్లాడవద్దని.. ఆ విషయాన్ని గెస్ట్ లకు కూడా బాలయ్య ముందే సూచిస్తాడని.. దాంతో ముందుగానే షోకి వచ్చిన గెస్ట్ లు కూడా దీనిపై ప్రస్తావన తీసుకురారని.. అందుకే బాబీతో కూడా జూనియర్ ఎన్టీఆర్.. జై లవకుశ సినిమా ప్రస్తావన తీసుకురాలేదని, రామ్ చరణ్ కూడా తారక్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయినా.. ఆయన గురించి ఏమీ మాట్లాడలేదని సమాచారం. బాలయ్య లోకల్ స్టార్, తారక్ గ్లోబల్ స్టార్.. ఆయనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు.. ఎవరి గొప్పలు, ఎవరు ఎంకరేజ్మెంట్ అసలు అక్కర్లేదు అంటూ ఆయనకు సపోర్ట్ గా మేమున్నామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.