టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలందరిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా స్పెషల్. ఆమె చాలా ప్రైవేట్ పర్సన్.. సినిమా ఈవెంట్స్ కి హాజరు కారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు, అసలు ఇప్పటివరకు మీడియాతో ముచ్చటించిందే లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులకు తెలుగు ఆడియన్స్‌కు ఆమె గురించి అసలు ఏమీ తెలియదు. ప్రణతి నేచర్ ఎలాంటిది.. ఆమె ఎలా ప్రవర్తిస్తారు.. ఆమె రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు.. అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది అభిమానుల్లో ఆరాటం ఉంటుంది. మిగతా హీరోల భార్యల అందరికంటే ప్రణతి చాలా డిఫరెంట్. చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమ్రత, బన్నీ భార్యా స్నేహ రెడ్డి అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
సినిమాలకు దూరంగా ఉన్న,, వాళ్ళు తమ అభిమానులతో ముచ్చటిస్తారు. తమ వృత్తి, లైఫ్ స్టైల్ ఏంటో అందరికీ తెలుసు. కానీ.. లక్ష్మీ ప్రణతి మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరం. కనుక ఆమెకు సంబంధించిన సంగతులు ఏవి ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే.. ఇటీవల లక్ష్మీ ప్రణతి బయట ఎలా ఉంటుంది.. ఆమె నేచర్ ఏంటి.. అనే దానిపై లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. నార్నే నితిన్ నటించిన హాయ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి ఎలాంటివారో చెప్పాలని యాంకర్ ప్రశ్నించగా.. ఒక తమ్ముడిగా ఆమెతో నాకు క్రేజీ బాండ్ ఉందంటూ వెల్లడించాడు.
అక్క చాలా రిసెర్వ్డ్ గా ఉంటుందని వెల్లడించాడు.. తను ఎక్కువగా ఎవరితో కలవదు, పెద్దగా మాట్లాడదు అంటూ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరి మధ్య మాత్రం మంచి బాండ్ ఉందని వివరించాడు. ఎన్టీఆర్ బామ్మర్ది మాటల్ని బట్టి లక్ష్మీ ప్రణతి మితభాషి, కొత్త పరిచయాలకు ఇష్టపడదనే విషయం క్లారిటీగా తెలుస్తుంది. ఇక 2011లో లక్ష్మీ ప్రణతి, తారక్‌లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ కాగా.. నిన్న మొన్నటి వరకు చాలా రిజర్వ్‌డ్‌గా కనిపించిన లక్ష్మీ ప్రణతి.. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి కనిపిస్తున్నారు. ఎప్పుడు ట్రెడిషనల్ గా మెరిసే ఈ అమ్ముడు.. ఇటీవల అమెరికా ట్రిప్ లో మోడరన్ డ్రెస్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్టీఆర్ 31 లాంచింగ్ ఈవెంట్‌లోను లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్‌తో కలిసి లక్ష్మీ ప్రణతి ఓ ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని తారక్ అభిమానులంతా ఆరాటపడుతున్నారు. మరి అలి ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి.