టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. కీయారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో నటించిన సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది.
ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో.. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా హైప్ విపరీతంగా పెరగడంతో గేమ్ ఛేంజర్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందట. ప్రస్తుతం సినిమా బిజినెస్ డీటెయిల్స్.. అలాగే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలని వివరాలుగా వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.130 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకొందని సమాచారం.
ఇందులో ఒక నైజం లోనే ఏకంగా రూ.127 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. ఆంధ్రాలో రూ.70 కోట్లు, సీడెడ్‌లో రూ.20 కోట్లకు గేమ్ ఛేంజర్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.250 కోట్ల బిజినెస్ జరుపుకుంది. మరి ఈ మొత్తం టార్గెట్ ని గేమ్ చేంజర్ రీచ్ కావాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉంది. ఈ క్రమంలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ మెగా అభిమానులు తమ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.