ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ హైప్‌తో రిలీజ్ అయిన సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాయి చూస్తూనే ఉన్నాం. కాగా.. ఈ సినిమాల్లో అన్ని హిట్స్ అవుతున్నాయా.. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందా అంటే.. మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పాలి. అలా భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 కూడా ఒకటి. నిజానికి పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్నో సినిమాలు హిట్ కొట్టిన రికార్డ్ శంకర్ ఖాతాలో ఉంది. కానీ ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం శంకర్ నుంచి గేమ్ ఛేంజర్ వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కనిపించనున్నాడు.
భారీ బడ్జెట్ కమర్షియల్ మూవీగా సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేస్తుందంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్‌కు కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇతర భాషల్లోను మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న భాషల్లో తమిళ్ వెర్షన్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే.. చరణ్ కు కోలీవుడ్లో బిగ్ షాక్ తగిలింది. గేమ్ ఛేంజర్ రిలీజ్ ఆపాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్స్ సంచలన ట్విట్ చేసింది. శంకర్ తమ బ్యానర్‌పై 2.0 అలాగే.. ఇండియన్ 2, పార్ట్ 3 సినిమాలు రూపొందించడం.. గత ఏడాది రిలీజ్ అయిన ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో.. పార్ట్ 3 రిలీజ్ అగమ్యగోచరంగా మారిందన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా సజావుగా గేమ్ ఛేంజర్‌ను శంకర్ రిలీజ్ చేయడం పై లైకా వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఇండియన్ 2 విషయంలో క్లారిటీ ఇవ్వాలని.. లేని పక్షంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానివ్వమంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇక్కడే ఇండియన్ 3 మేకర్స్ అసలైన లాజిక్‌ను మిస్ అవుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2తో లైకా డిజాస్టర్ ను ఎదుర్కొన్న గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అయితే.. తర్వాత అది ఇండియన్ 3 కే ప్లస్ అవుతుందని మరికొందరి వాదన. అప్పట్లో ఇండియన్ 3 ట్రైలర్ కి అదిరిపోయే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి క్రమంలో ఇండియన్ 3 పై గేమ్స్ ఛేంజర్ సక్సెస్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుందంటూ.. ఈ విషయాన్ని లైక్ కా వారు ఆలోచించడం లేదని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా తమిళ్‌లో రిలీజ్ అవుతుందా.. లేదా.. అనేది వేచి చూడాలి.