సంక్రాంతి మూడు సినిమాల మూడ్ ఇదే… ఒక్కో సినిమాకు ఒక్కో మూడ్‌…!

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌కు ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూడు సినిమాలు ఎలా ఉంటాయి.. ఎలా ఉండబోతున్నాయి.. టార్గెట్ ఓ రేంజ్ లో ఉండనుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం.

Balakrishna : డాకూ మహరాజ్ గా బాలయ్య | Balayya as Daku Maharaj

డాకు మహారాజ్:
మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ హీరో బలమైన పాత్ర, అంతకన్నా బలమైన పాత్ర విల‌న్. వీళ్ళిద్దరి మధ్య జరిగే పవర్ ఫుల్ సంఘర్షణ.. ఓ ఎన‌ర్జిటిక్‌ పాయింట్. దీనికి తోడు స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్.. అందులో మరింత బలమైన హీరో ఇంకో షెడ్.. ఇది ఓవ‌రాల్ సినిమా ప్యాకింగ్ మెటీరియల్. ఇక సినిమాను ఈ మెటీరియల్ తో ఎంత ఆకర్షణీయంగా డిజైన్ చేశారన్నదానిపై సినిమా రిజల్ట్ బేస్ అయి ఉంటుంది.

గేమ్ ఛేంజర్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కు ఆడియన్స్ను వెళ్లేలా చేసే పాయింట్స్ భారీ ప్రాజెక్ట్, భారీ స్టోరీ. మూవీ వేవ్ అంతా అభిమానులు, యూత్, మాస్ కంటెంట్.. చుట్టూనే తిరుగుతుంది. భారీ ప్రాజెక్ట్, భారీ స్టోరీ రూపొందుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులను థియేటర్‌ల‌లో బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాలి. తగిన స్క్రీన్ ప్లే, సినిమాలో యాడెడ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుంటాయి.. జనాన్ని ఎలా మెప్పిస్తాయి.. అనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.

కన్ఫ్యూజన్ తీరింది.. వెంకటేష్ కూడా సంక్రాంతికే | Venkatesh Sankranthiki  Vasthunam Movie Release Date With Poster, Check Interesting Insights |  Sakshi

సంక్రాంతికి వస్తున్నాం:
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో పండగ నాడే రిలీజ్ కానున్న ఈ సినిమా మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే ఖర్చు ప్రకారం చిన్న సినిమా. కానీ.. బజ్‌లో మాత్రం అస్సలు తగ్గేదేలే. సైలెంట్గా సంక్రాంతి విన‌ర్‌గా ఈ సినిమా నిలిచిన ఆశ్చ‌ర్యం లేదు. ఇక ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ఫన్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా కనిపిస్తుంది. ఇక పండగ సీజన్ అంటే స్టోరీ మినిమం ఉన్న చాలు. ఈ క్రమంలోని మొత్తం మీద ఈ మూడు సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఏ సినిమా సక్సెస్ అందుకుంటుంది. సంక్రాంతి బారిలో ఏ హీరో కింగ్ గా నిలుస్తాడో వేచి చూడాలి.