అక్కినేని అకిల్‌తో శ్రీ లీల.. ఎక్స్ క్లూజివ్ న్యూస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీలకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత వరస సినిమా ఆఫ‌ర్‌ల‌ను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన కూడా గుంటూరు కారం సినిమాలను నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. నటించిన‌ చాలావరకు సినిమాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చింది.

naga chaitanya-akhil - Telugu Journalist

ఇక తాజాగా పుష్ప 2 ఐటెం సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ గా మెరిసిన శ్రీలీలా.. కిసిక్ అంటూ కెరీర్‌లో మళ్ళీ స్పీడ్ ను పెంచింది. ఈ క్రమంలో తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ నెక్స్ట్ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ డైరెక్టర్ తో అన్నపూర్ణ బ్యానర్ పై ఓ సినిమా కోసం శ్రీ‌లీల‌ను హీరోయిన్గా తీసుకున్నారు అని సమాచారం. విషయం ఏంటంటే.. మొదటిసారిగా అన్నపూర్ణ బ్యానర్, సితార బ్యానర్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు.

Sreeleela | Laugh so hard That your abs can feel it ! | Instagram

ఇదిలా ఉంటే విరూపాక్ష డైరెక్టర్ నాగచైతన్యతో తెర‌కెక్కించే సినిమాకు కూడా శ్రీ లీలని తీసుకున్నారు అంటే.. అన్నదమ్ములు ఇద్దరికీ ఒకేసారి హీరోయిన్గా శ్రీ లీల కనిపించబోతుంది. ఇప్పటికే రవితేజతో సితార బ్యానర్ పై నటించిన శ్రీ లీల.. అదే బ్యానర్‌లో సిద్దు జొన్నలగడ్డ సినిమాకు హీరోయిన్‌గా ఫైనల్ అయింది. అంటే.. శ్రీ లీల కేవలం సితార బ్యానర్ లోనే ఏకంగా మూడు సినిమాలు చేసినట్లు అవుతుంది. మొత్తం మీద శ్రీ‌లీల‌ ఇప్పుడు ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది.