వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ అల్లు అర్జున్ తరుఫున న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి మధ్యస్థ బెయిల్‌ను తీసుకువచ్చాడు.

అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌తో ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయిన సంగతి తెలిసిందే. చేయని తప్పుకు త‌మ‌ ఫేవరెట్ హీరోను అరెస్ట్ చేశారు అంటూ తెగ ఫైర్ అయ్యారు. ఇలాంటి క్రమంలో ఈరోజు ఉదయం అల్లు అర్జున్ మధ్యస్థ బెయిల్‌తో రిలీజ్ అయి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బ‌న్నీ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. ఇలాంటి క్రమంలో బన్నీ గురించి మరో వార్త వైరల్ గా మారుతుంది. ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్ పై దీనితో పాటు రెండు కేసులు నమోదయ్యాయట.

Fans go crazy as Allu Arjun visits Nandyal to support YSRCP candidate.

వాటిలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి ని కలిసేందుకు ప్రచారానికి వెళ్లిన సమయంలో ఓ కేస్ ఫేస్ చేశాడు. 144 సెక్షన్ కింద బన్నీ పై అప్పుడే కేసు నమోదు అయింది. అప్పుడు కూడా హైకోర్టును ఆశ్రయించిన బన్నీ కేస్ కొట్టేమంటూ కొర్ట్‌ను అభ్యర్థించాడు. ఇక.. ఈ కేస్‌తో పాటే.. ఫ్యాన్స్ అసోసియేషన్‌కు ఆర్మీ అనే పేరు పెట్టి ఇండియన్ సైన్యాని అవమానిస్తున్నారని.. మరో కేస్ బన్నీపై రిజిస్టర్ అయింది. దీంతోపాటే.. తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసులాట కేసులో కూడా అల్లు అర్జున్‌ను ముద్దాయిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించిన ఈ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది.