అఖండ 2 తాండవంతో ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్ లయ కూతురు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహ‌రాజ్‌ సినిమాతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సినిమాలో నటించనున్నాడు. బోయపాటి డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న క్రమంలో.. స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చి.. కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక అఖండ మూవీ లో బాలయ్య అఘోర పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ హీరో ఇజాన్ని వేరే లెవెల్ లో ఎలివేట్ చేశాడు.

The massive combo Balayya- Boyapati is back with 'Akhanda 2 – Thandavam'

బోయపాటి అఖండ 2 తాండవం అనే టైటిల్‌తో కొంతకాలం క్రితం ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని నందమూరి అభిమానులే కాదు.. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రియులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా.. ఈ సినిమా షూటింగ్.. పూజ కార్యక్రమాలను గ్రాండ్ గా ప్రారంభించారు. ఇక సినిమాను 25 సెప్టెంబర్ 2025 దసరా కానుకగా రిలీజ్ చేస్తామని.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆర్ ఎఫ్ సి లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది.

Laya: లయ కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ?.. క్లారిటీ ఇచ్చిన  హీరోయిన్.. - Telugu News | actress Laya gave clarity about her daughter's  entry into the film industry telugu cinema news ...

ఈ సినిమాతో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ లయ‌ కూతురు శ్లోక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌నుందట. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్లోక కనిపించనుందని సమాచారం. ఈ వార్త పై ఇంకా క్లారిటీ రాకపోయినా.. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక లయ ఇప్పటికే రీ ఎంట్రీ ఇచ్చేందుకు తెలుగులో రెండు సినిమాలను సిద్ధం చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వినిపించడం.. అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. 14 డేస్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న అఖండ 2 తాండవం కి ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. బాలకృష్ణ కూతురు తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.