చెయ్యని తప్పుకు జైల్.. ఇక పై తగ్గదేలే.. పుష్పరాజ్ షాకింగ్ డెసిషన్.. !

చంచల్గూడా జైల్ నుంచి రిలీజ్ అయిన బన్నీ.. మరోసారి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ బన్నీ ఎమోషనల్ అయ్యాడు. జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అంటూ చెప్పుకొచ్చాడు. నా ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు సపోర్ట్ గా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ వెల్లడించిన బన్నీ.. నేను బాగున్నాను. ఎవరు టెన్షన్ పడొద్దు.. చట్టం పట్ల నాకు గౌరవం ఉంది. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్న.. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.. గత 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్‌కు వెళ్తున్నా.. ఏం చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చ‌లేయు అంటూ చెప్పవచ్చాడు.

చట్టం ఎలా చెప్తే నేను అలా చేస్తా అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. ఇక చంచల్‌గూడా జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకున్న వెంటనే.. బన్ని ని చూసి భార్య స్నేహ రెడ్డి, పిల్లలు ఎమోషనల్ అయ్యారు. స్నేహారెడ్డి భర్తను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే జైలు నుంచి రిలీజ్ కాగానే నేరుగా ఇంటికి వెళ్ళ‌కుండా.. గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లడం వెనుక.. ఏం జరిగి ఉంటుందని చర్చ హాట్ టాపిక్ గా మారింది. గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో అల్లు అరవింద్‌తో పాటు.. బన్నీ వాస్, అలాగే పలువురు సన్నిహితులు ఉన్నారట. నిన్న బెయిల్‌ వచ్చినా.. ఇవాళ రిలీజ్ అవ్వడంపై వారితో బన్నీ అసంతృప్తి వ్య‌క్తం చేసినట్లు సమాచారం.

చేయని తప్పుకు జైలుకు వెళ్లాను అంటూ ఎమోషనల్ అయినా బన్నీ.. రాత్రంతా జైల్లో నిద్రపోకుండానే ఉన్నాడట. అంతేకాదు.. ఈ కేసులో ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని దానిపై కూడా చర్చ నడుస్తుందని.. జైలు అధికారులపై కోర్టు ధిక్కరన కేసు వేయాలని.. ఎంత ఖర్చైనా పర్లేదు.. ఈ కేసులో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు లీగల్ టీంకు బన్నీ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి అల్లు అరవింద్ కు కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించాడట బన్నీ. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చా.. మళ్లీ వెళ్తా అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యాడట. ఇప్పటికే తన స్నేహితులతో బన్నీ మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. జైలుకు వెళ్ళాడాన్ని సవాల్ గా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ నిర్ణ‌యం కాస్త రిస్క్ చేస్తున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.