ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అంతా పెళ్ళై.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ పాత్రలో నటిస్తు మెప్పించేవారు. అయితే.. ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి చేసుకుంటే గ్లామర్ షో చేయకూడదా.. అలా ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక సినిమా అవకాశాలు తగ్గినట్టే, గ్లామర్ షోకు గుడ్ బై చెప్పినట్టే, ఇండస్ట్రీలో ఉండడం కష్టమే అంటూ ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు. పెళ్లయిన హీరోయిన్లకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్.. గ్లామర్ షో తో మరింత దూకుడు పెంచేస్తున్న మన ముద్దుగుమ్మలు.. సరికొత్త క్రేజీ ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దాం.
కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్.. గత 15 సంవత్సరాలుగా తను ప్రేమిస్తున్న ఆంటోని తడానితో గోవాలో ఇటీవల మూడు ముళ్ళు వేయించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెండు రోజులు ముందు కూడా టూ హాట్ గ్లామర్ ఫోటోషూట్ తో అందరికీ ట్రీట్ ఇచ్చింది. పెళ్లి దగ్గర పడుతున్న క్రమంలో కూడా గ్లామర్ షో తో ఈ రేంజ్ లో గత్తర లేపడం ఆడియన్స్‌కు షాక్ కలిగించింది. నిన్న మొన్నటి వరకు ట్రెడిషనల్ పాత్రలోనే మెరిసిన కీర్తి.. బాలీవుడ్ కి వెళ్ళగానే ఇంత హాట్ గా మారిపోయింది ఏంటి అంటూ పలు అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక ఈ అమ్మడు మొదటిసారి బేబీ జాన్ లో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాల్లో మునుపెన్నడు చూడని రేంజ్ లో గ్లామర్ షో తో ఆకట్టుకోనుంది కీర్తి.
రకుల్ ప్రీత్ సింగ్
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు నటిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈమె కూడా గత ఏడాది ప్రియుడు జాకీ భగ్నాని ని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా గ్లామర్ డోస్ లో ఏమాత్రం తగ్గేదిలే అంటూ రెచ్చిపోతున్న ఈ అమ్మడు.. తన కొత్త హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ళను కవ్విస్తుంది.
కియారా అద్వానీ
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ పలు సినిమాలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సిద్ధార్థ మల్హోత్రాన్ని ప్రేమించే వివాహం చేసుకుంది. తర్వాత కూడా లిప్ లాక్ సన్నివేశాల్లోనూ, బెడ్ రూమ్ సీన్స్ లోనూ గ్లామర్ షో తో హద్దులు చెరిపేసింది. ఇక ఈ అమ్మడు త్వరలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్ ని పలకరించనుంది.
అలియా భట్
త్రిబుల్ ఆర్ రామ్ చరణ్‌కు జంటగా నటించిన అలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ భార్య అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరికి ఒక పాప ఉన్నా ఇప్పటికీ ఆలియా భట్ గ్లామర్ షోలో ఏం మాత్రం తగ్గేదెలా అంటూ దూసుకుపోతుంది. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, దీపికా పదుకొనే కూడా.. ఇప్పటికీ వేరే లెవెల్‌లో గ్లామర్ షో తో ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. పెళ్లి, గ్లామర్ షోకు సంబంధం లేదంటూ స్టార్ హీరోయిన్స్ అంతా హాట్ షోతో గత్తర లేపుతున్నారు.