అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన ప్ర‌భాస్.. కల్కి తర్వాత ఇదే ఫస్ట్ టైం..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు అండగా నిలుస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్లి మరి కలిసిన దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్ పై ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బన్నీ ఇంటికి రావడం.. ఆయనతో ఆప్యాయంగా మాట్లాడడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమా తెర‌కెక్కగా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్ బయట కనిపించ లేదు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో త‌న‌ను పరామర్శించేందుకు ఇంటికి వచ్చారు. బ‌న్నీ ఇంటికి చేరుకున్న ఆయన.. కొంతసేపు అల్లు అర్జున్ తో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు. ఇక ప్రభాస్‌తో పట్టే.. బన్నీని పలకరించేందుకు నాగచైతన్య, రానా దగ్గుబాటి,విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు) | Allu Arjun returns home, Tollywood celebrities show solidarity | Sakshi

కాగా.. నిన్న శుక్రవారం ఉదయం 12 గంటలకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. గాంధీ హాస్పిటల్ మెడికల్ చెకప్స్ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు చేశారు. కోర్ట్‌లో విచారణ తర్వాత 14 రోజుల రిమాండ్ విధించగా.. రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి.. ఆయనతో గంటసేపు వాదించి క్వాష్‌ పిటిషన్ ద్వారా మద్యంతర బెయిల్‌ వచ్చేలా చేశాడు. కాగా నిన్న రిలీజ్ కావాల్సిన బన్నీని.. రాత్రంతా చంచల్‌గూడా జైల్లోనే ఉంచి.. ఉదయం బెయిల్ పై బయటకు వదిలారు. ఇక ఇంటికి చేరుకున్న బన్నీ.. ఫ్యాన్స్‌తో పాటు.. మీడియాతోనూ ముచ్చటించారు. ఇప్పటికి ఆయన పరామర్శించేందుకు వచ్చిన సెలబ్రిటీలను స్వాగతిస్తున్నారు బ‌న్నీ.