కొత్త సంవత్సరాన్ని గేమ్ ఛేంజర్‌తో స్వాగతం పలుకుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కియారా అద్వాని హీరోయిన్గా.. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు టాలీవడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాల్లో అంజలి, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడం.. ఇప్పటికే చరణ్ నుంచి సినిమా రిలీజై నాలుగేళ్లు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.
అయితే గత కొద్దిరోజులుగా గేమ్ ఛేంజర్ సీక్వెల్ ఉండబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఈ సినిమాల్లో కీలకపాత్రలో నటించిన.. సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సీక్వెల్ ఉందా అనే ప్రశ్నకు.. ఆయన రియాక్ట్ అవుతూ.. గేమ్ చేంజర్‌కు సీక్వెల్ లేదని వెల్లడించాడు.
ఇక ఈ మూవీలో అప్పన్న పాత్రలో చరణ్ నటన చూసి అందరూ ఆశ్చర్యపోతారని.. చాలా కొత్తగా కనిపించనున్నాడు.. ఇందులో ఎస్.జే.సూర్య రోల్ సరిపోదా శనివారం క్యారెక్టర్ ను మించిపోయి ఉంటుందంటూ వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం పడిన కష్టాన్ని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. కాగా శ్రీకాంత్ గేమ్ ఛేంజర్ సీక్వెల్ లేదని చెప్పడంతో ప్రస్తుతం ఆయన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 2025 జనవరి 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా.. లేదా.. ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.