తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా.. తమదైన రీతిలో సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వద్ద కూడా మన తెలుగు హీరోలు సత్త చాటుతున్న క్రమంలో.. బాలీవుడ్ స్టార్లకు దిగులు మొదలైంది. అలా ఈ ఏడాది బాలీవుడ్ కు కునుక్కు లేకుండా చేసిన మన హీరోల సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఇక ఈ ఏడదీ ఇప్పటివరకు కల్కి , హనుమాన్, దేవర, పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై.. నాలుగు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచి కలెక్షన్లతో సంచలనం సృష్టించాయి. ఇక వచ్చే కొత్త సంవత్సరంలో కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సత్తా చాట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు అందరూ స్టార్ హీరోల నుంచి వచ్చే ఏడదిలో కచ్చితంగా ఓ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మరోసారి టాలీవుడ్ భారీ విజయాలను సాధించేదిశగా దూసుకుపోతుందని.. టాలీవుడ్ ప్రేక్షకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే టాలీవుడ్ నెంబర్ వన్ ఇండస్ట్రీ అనే అంతలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తెలుగు సినీ పరిశ్రమ. మన స్టార్ హీరోస్ మరింత సక్సెస్ అందుకోవాలని ఇప్పటికే వచ్చిన ఖ్యాతితో.. దాదాపు మరో 10 సంవత్సరాలు పాటు మన తెలుగు హీరోల ఇండియన్ సినిమాను రూల్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఏడాది సక్సెస్ బేస్ చేసుకుని మన వాళ్ళ హవా ఫ్యూచర్లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూడాలి.