మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌కి బ్రేక్.. బాలయ్య ఫోకస్ అంతా ఆ డైరెక్టర్ మీదే…!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్‌ల‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ప్రశాంత్ వ‌ర్మ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం వరస ప్రాజెక్టులు అందుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య తనయుడుగా మోక్షజ్ఞ తో ఓ సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. దీంతోపాటే.. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా.. జై హనుమాన్ కూడా ఆయన త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్న సంగతి తెలిసిందే.

Is 'Hanuman' fame Prasanth Varma directing the father-son duo  Balakrishna-Mokshagna? Here is what we know | - Times of India

ఇక ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. పాన్ ఇండియాలో కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ఇకపై నుంచి భారీ సక్సెస్ లను సాధించడం ఖాయం అంటూ ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మపై నమ్మకంతో బాలయ్య.. తన కొడుకు డబ్యూ మూవీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా దీనికి సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డబ్యూ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు మారుమోగిపోతున్నాయి.

అయితే ఈ విషయంపై బాలయ్య కాని.. ప్రశాంత్ వర్మ కాని ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే సినిమా ఆగిపోయిందా.. లేదా వర్క్ కొనసాగుతుందా.. అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. బాలయ్య తన మనసు మార్చుకున్నాడని మోక్షజ్ఞ డెబ్యూ మూవీని మరో దర్శకుడితో చేయించాలని ఆలోచనలో ఉన్నాడని టాక్‌. తాజాగా సమాచారం ప్రకారం.. రీసెంట్గా లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య బాబు ఆలోచన చేస్తున్నాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే.. దీనిపై బాలయ్య రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.