పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈయన.. దాదాపు అరడజన్ సినిమాలను లైన్లో ఉంచుకున్నాడు. ఈ క్రమంలోనే చేతినిండా సినిమాలతో షూటింగ్లలో ఖాళీ లేకుండా గడిపేస్తున్న ప్రభాస్.. త్వరలోనే రాజాసాబ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇక బాహుబలితో సినిమా పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ఈయన.. ఇదే ఊపుతో వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటించి.. పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రతి సినిమాను డిఫరెంట్ జానర్‌లో నటిస్తూ నెమ్మదిగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక ఈ మూవీ తర్వాత ఫౌజీలో ప్రభాస్ కనిపించనున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి కేవలం ఒకే ఒక అప్డేట్ డైరెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని.. మొదటిసారి యూనిఫామ్‌తో వెండితెరపై మెరువనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో సినిమాపై అంచనాలు డబ్బుల్ అయ్యాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాల్లో కొరియన్ స్టార్ హీరో మా డాంగ్ సియాక్.. కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఫిలిం సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు సియాకు వర్సెస్ ప్రభాస్ సీన్స్ సందీప్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై విపరీతమైన ఆశక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కాంబోకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే మూవీలో సియాక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నాడని.. అతన్ని వైల్డ్ గా ఎదిరించే ఇండియన్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఉండనున్నడని తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే.. తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడని అర్థమవుతుంది, ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అంటూ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.