టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా.. ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా సినిమాపై మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకున్నా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఫ్యూజ్‌లు ఎగిరిపోయే అప్డేట్ వైరల్‌గా మారింది. జక్కన్న – మహేష్ కాంబో మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. మాజీ మిస్ వరల్డ్.. టాప్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.
మహేష్ – జక్కన్న కాంబో మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుందట. గాయకుడు, నటుడు నీకు జోనస్‌ను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుతుంది. చివరగా సిటాడెల్ సీజన్ 1లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. సీజన్ 2 లో కూడా కనిపించనుంది. అయితే ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించబోతుందంటూ ఫిలింఫేర్ తన కథనంలో వెల్లడించింది.
మహేష్ సినిమా కోసం ఇప్పటికే తన మేకవర్తో సిద్ధమయ్యాడని సమాచారం. ఇక జక్కన్న సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్స్ మూవీ గా రూపొందించనున్నాడు. దాదాపు రూ.1000 కోట్ల అధిక బడ్జెట్ తో ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రియాంక చోప్రా చివరిగా స్కై పింక్ అనే సినిమాలో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ అమ్మడు మహేష్.. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో అవకాశం అందుకుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు జాక్‌పాట్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ వార్తలో వాస్తవం తెలియాలంటే.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి.