స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను.. ఈ ఏడది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. చాలా ఏళ్లపాటు అతనితో డేటింగ్ చేసి.. ఈ ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. రాజస్థాన్ ఉదయపూర్‌లో వీరి పెళ్ళి గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి పన్ను తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారుతున్నాయి.
తన పెళ్లి గత ఏడాదిలోనే అయిపోయింది అంటూ ఆమె ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. ఇక గతేడాది డిసెంబర్లో తామిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని.. అఫీషియల్ గా పెళ్లి అప్పుడే అయిపోయిందంటూ చెప్పుకోచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఉదయపూర్ లో కేవలం మ్యారేజ్ సెలబ్రేషన్స్ మాత్రమే జరుపుకున్నామని అసలు విషయాన్ని వెల్లడించింది. పర్సనల్ విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పడానికి ఇష్టపడము.. అందుకే ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ తెలియలేదు అంటూ వివరాంచాంది.
పర్సనల్ విషయాలు బయట పెడితే వర్క్ లైఫ్ దెబ్బతింటుందని ఆమె వెల్లడించింది. కాగా ఈ ఏడది మార్చిలో ఉదయపూర్ లోని ఓ కోటలో మరోసారి ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో ఆమె సన్నిహితులు, స్నేహితులు పాల్గొని సందడిచేశారు. తర్వాత వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక తెలుగులో తాప్సీ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.