టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్‌ఆర్ఆర్, మగధీర లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయన ఫ్యామిలీ గురించి చాలా వరకు ఆడియన్స్ కు తెలుసు. ఇక ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న.. తాజాగా రానా టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. కానీ అన్ని ఇంటీర్వ్యూలకంటే ఇది చాలా భిన్నంగా ఉండనుందుని.. ఇప్పటివరకు ఎవరికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి ఈ షోలో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. తన ఇంటర్మీడియట్ ప్రేమ కథను రివీల్ చేశాడు జక్కన్న.
ద రానా దగ్గుబాటి షో పేరుతో నటుడు రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అమెజాన్ ప్రైమ్ లో ప్రతి వీకెండ్ కొక్క ఎపిసోడ్ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు నాని, సిద్దు జొన్నలగడ్డ, శ్రీ లీల, నాగచైతన్య పాల్గొన్న.. కొన్ని ఎపిసోడ్లు టెలికాస్ట్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తో మాట్లాడిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేదని.. ఆమె అంటే ఎంతో ఇష్టమని.. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికి ఆ మ్యాటర్ తెలుసు. నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని నన్ను ఈ విషయంపై ఎప్పుడు ఏడిపించేవారు కూడా. మొత్తం ఏడాదిలో ఒకే ఒకసారి ఆమెతో మాట్లాడా అంటూ జక్కన్న కామెంట్ చేసాడు. అది కూడా చాలా కష్టం పై మాట్లాడానని.. ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగా అంటూ రాజమౌళి వెల్లడించాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ప్రస్తుతం జక్కన చెప్పిన ఈ లవ్ స్టోరి వైరల్ అవుతుంది.