సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు దాదాపు 5 సినిమాల్లో నాగచైతన్యతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమా టైంలోనే చైతన్యతో ప్రేమలో పడిపోయింది. ఎవరికి తెలియకుండా చాలా కాలం సీక్రెట్ ఏఫైర్ నడిపిన ఏ జంట.. తర్వాత పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొంతకాలానికి మనస్పర్ధలతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక విడాకుల తర్వాత దాదాపు ఏడాదిన్నరగా సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సిటాడెల్..హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించింది.
అంతేకాదు సొంత ప్రొడక్షన్ సంస్థ ప్రారంభించి మా ఇంటి బంగారం పేరుతో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత నెంబర్ ఓ టాలీవుడ్ హీరో బ్లాక్ చేశాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. వీళిద్దరు ప్రేమించుకునే టైంలో ఓ షాకింగ్ సంఘటన జరిగిందట. అందరిలాన్నే ఎప్పటికప్పుడు వీళ్ళు గొడవలు పడుతూ ఉండేవారట. అలా నాగచైతన్య ఓ సినిమా షూట్ లో ఉన్న టైంలో.. సమంత పదే పదే ఫోన్ చేస్తూ విసిగించడంతో.. సమంత నెంబర్‌ను నాగచైతన్య బ్లాక్ చేసేసాడట.
తర్వాత ఫోన్ చేసిన సమంతకు చైతు తన నెంబర్ బ్లాక్ చేశాడని తెలియడంతో.. నేరుగా షూటింగ్ స్పాట్‌కే వచ్చి తానే కార్లో కూర్చుని షూటింగ్ నుంచి నాగచైతన్యను తన కార్ దగ్గరకు రప్పించుకుందట. ఇక సమంతపై కోపాన్ని నాగచైతన్య కూడా మర్చిపోయి సారీ చెప్పి మళ్ళీ నెంబర్ అన్ బ్లాక్ చేశాడట. ఈ వార్తలో వాస్తవం తెలియదు కానీ తెగ వైరల్గా మారుతుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం తన సెకండ్ మ్యారేజ్‌కు కూడా సిద్ధమయ్యాడు. శోభిత దూళిపాళ్లతో.. నాగచైతన్య ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకునే సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.