ఈ తారక్ బ్యూటీని గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు నిజంగా జీనియస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు. డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌, నటనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటున్న తారక్.. రీసెంట్గా దేవరతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర పార్ట్ 2 తో పాటు.. మరికొన్ని సినిమాలలో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కలిసి గతంలో నటించిన ఎంతోమంది హీరోయిన్స్ ప్రస్తుత ఫోటోస్ సొష‌ల్ మీడియ వేదిక తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా ఒకటి. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Subbu Movie: ‘సుబ్బు’ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా  ?.. ఇప్పుడెలా...

ఆమె ఎవరో గెస్ చేస్తే నిజంగానే మీరు జీనియ‌స్‌. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా.. అది కాస్త కష్టం లేండి మేమే చెప్పేస్తాం. ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా సుబ్బు. ఈ సినిమా 2001లో రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన‌ ఫ్యాన్స్ మాత్రం క‌నెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో సాంగ్స్‌కు జ‌నం ఫిదా అయ్యారు. రుద్రరాజు సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రావడంతో.. అంచనాలను అందుకోలేక డీలపడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న నటించిన హీరోయిన్ గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు సోనాలి జోషి.

Exclusive: Subbu Movie Heroine Sonali Joshi Photo Shoot

సుబ్బు సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత ఈమెకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్ళాం లాంటి సినిమాలో నటించిన సరైన బ్రేక్ తగలలేదు. దీంతో ఇండస్ట్రీలో ఆమడికి అవకాశాలు కరువయ్యాయి. అలా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిన సోనాలి జోష్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తన అప్డేట్స్‌ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మడి లేటెస్ట్ పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈమె సుబ్బు హీరోయిన్ అని తెలిసిన వారంత ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఆ హీరోయిన్ ఇంతలా మారిపోయింది అంటూ.. అసలు ఈమె సుబ్బు మూవీ హీరోయినేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.