సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా మారడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమ సత్తా చాటుతున్నారు. వారిలో సమంత కూడా ఒకటి. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సంపాదించుకున్న సమంత.. తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బాలీవుడ్ సిటాడల్.. హనీ బన్నీ సిరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించింది.
ఇక సినిమాలో సమంత చాలా హాట్ సన్నివేశాలలోను ఆకట్టుకుంది. వరుణ్ ధావన్, సమంత మధ్య లిప్ లాక్ సీన్స్ కుర్రకారుకు కాక పుట్టిస్తున్నాయి. అంతే కాదు సమంత ఇందులో చాలా బోల్డ్ సన్నివేశాల్లో మెరిసింది. దీంతో ప్రతి ఒక్కరు సమంత ఏంటి..? ఇలా నటించింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఎంత పెద్ద స్టార్ మోడల్ సెలబ్రెటీ అయినా.. వారి లైఫ్ లో ఓ రోల్డ్ మోడల్ తప్పకుండా ఉంటారు. ఈ క్రమంలోనే సమంత కూడా తన రోల్ మోడల్ ప్రియాంక చోప్రా అంటూ చెప్పుకొచ్చింది.
బిజినెస్ టుడే నిర్వహించిన.. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన శ్యామ్.. మాట్లాడుతూ తనకు రోల్డ్ మోడల్ ప్రియాంక చోప్రా అని.. సిటాడెల్ ఫస్ట్ సీజన్ అమెరికాలో, సెకండ్ సీజన్ ఇటలీలో, థర్డ్ సీజన్ ఇండియాలో, నాలుగో సీజన్ మెక్సికోలో జరుగుతూ ఉందని.. చెప్పుకొచ్చింది. అమెరికా వర్షన్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించగా.. ఇందులో నటించే ఛాన్స్ తర్వాత నాకు వచ్చిందంటే చెప్పుకొచ్చిన సమంత.. ప్రియాంక చాలా గొప్ప నటి. గొప్పగా ఆలోచించడం ప్రియాంక నుంచి నేను నేర్చుకున్నా.. ఆమె నా రోల్డ్ మోడల్ అంటూ చెప్పుకొచ్చింది. మగవారు రోల్డ్ మోడల్ అంటూ ఎవరూ లేరని.. అమ్మాయిలే నా రోల్డ్ మోడల్స్ అంటూ సమంత కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే మగవాళ్ళు వద్దు.. అమ్మాయిలే ముద్దు అంటే సమంత చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.