టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1990లో ఇండస్ట్రీని ఓ ఊపుఊపిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా అటు యాక్షన్ మూవీస్.. ఇటు రొమాంటిక్ సన్నివేశాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎన్నో స్ట్రాంగ్ రోల్స్‌లో నటించి సక్సెస్ అందుకుంది. ఈమె తర్వాత హీరోయిన్లతో సోలో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు కూడా సాహసం చేసేవారు. ఇక ఈ అమ్మడు 1980లో తన 14వ ఏట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఖిలాడి కృష్ణుడు సినిమాలో మొదట హీరోయిన్గా పరిచయమైంది.
అయితే ఆమె తొలి ప్రయాణానికి అడ్డంకులు ఎదురయ్యాయట. వయసు రిత్యా విజయశాంతిని హీరోయిన్గా తీసుకోవడానికి కృష్ణ ఆలోచించాడట. అమ్మే ఇంత చిన్న వయసులో తన పక్కన నటించగలరా అని ఆలోచించారట. తన సొంత కూతురు తో ఆమెను పోల్చుకున్నారట. అయితే సినిమా దర్శకురాలిగా వ్యవహరించిన కృష్ణ భార్య విజయనిర్మల మాత్రం విజయశాంతి కెపాసిటీని గుర్తించి ఆమెపై నమ్మకంతో హీరోయిన్గా చేస్తుందని చెప్పారట. ఈ యంగ్ బ్యూటీ ఏదో ఒక రోజు స్టార్ హీరోయిన్గా మారుతుందని కృష్ణకు భరోసా ఇచ్చి మరి విజయశాంతిని నటింపజేశారట. అలా ఈ సినిమాలో నటించిన విజయశాంతి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. చివరకు విజయనిర్మల చెప్పిన మాటలే నిజమయ్యాయి. తర్వాత విజయశాంతి స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. తన కెరీర్ ప్రారంభంలో విజయనిర్మల ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఆమె మరణం పట్ల తను అనుభవించిన బాధను కూడా షేర్ చేసుకుంది. ఇక విజయనిర్మల చనిపోయిన తర్వాత తను కన్నీరు ఆపుకోలేక.. వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలాగే తన గురువుగా భావించే దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయినప్పుడు కూడా అమ్మే తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఇక తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి.. సూపర్‌స్టార్ తనయుడు మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రతో కం బ్యాక్ ఇచ్చిన విజయశాంతి.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.