టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తుండడంతో ఈ మూవీపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద సక్సెస్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి చేసేసారు. కేవలం స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. కాగా.. ఈ సినిమా ప్రారంభం నుంచే స్పెషల్ సాంగ్ కోసం గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ను సంప్రదించారట మేకర్స్. చివరకు శ్రీ లీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
శ్రీలీల, బన్నీ కాంబోలో స్పెషల్ సాంగ్ అంటే అది నిజంగా వెండితెరపై సంచలనమే అండంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరూ డ్యాన్స్‌లో ఆరితేరిన వారు కావడంతో.. ఇద్దరు కాంబోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తుందని ధీమ వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప 2కు మొదటి రోజు రూ.270 కోట్లు వసూలు వచ్చే అవకాశం ఉందట. ప్రముఖ ఫిలిం వెబ్సైట్ సాక్నిక్ అంచనా ప్రకారం.. పుష్ప 2కి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండియాలో రూ.200 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని.. అలాగే సిడెడ్ లో 70 కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయంటూ తెలుస్తుంది.
ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే పుష్ప 2 ఫస్ట్ డే లోనే రూ.270 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేయడం ఖాయం. ఇక భారత దేశంలో ఏ ప్రాంతం నుంచి ఎన్ని కోట్లు వస్తాయో కూడా సాక్నిక్ అంచనా ద్వారా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.85 కోట్లు, తమిళ్లో రూ.12కోట్లు, కర్ణాటకలో రూ.20 కోట్లు, కేరళ నుంచి రూ.8 కోట్ల వసూలు వస్తాయని.. అలా ఇండియా మొత్తంలో మిగతా ప్రాంతాల నుంచి రూ.70 కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయని చెబుతున్నారు. మొత్తంగా ఇండియాలో ఈ సినిమాకు రూ. 270కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ నివేదిక నెటింట వైరల్ గా మారడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుష్పరాజ్ మరోసారి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.