అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతు ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తండేల్‌తో ఇటు చైతన్య.. అటు సాయి పల్లవికి కూడా మంచి సక్సెస్ అందుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్లకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే శోభిత ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయిన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పరిమితంగానే ఉంటూ దర్శక, నిర్మాతల హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ అమ్మడు ఫేవరెట్ ఫుడ్ ఏమై ఉంటుంది అనే అంశం వైరల్ గా మారుతుంది. శోభిత ధూళిపాళ్ల ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆమెకు ఎంతో ఇష్టమైన ఆహారం పునుగులట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. శోభిత తెలుగు అమ్మాయి కావడంతో.. ఆమెకు మొదటి నుంచి మన ఆహారమే నచ్చుతుందట.
చిన్న చిన్న హోటళలో దొరికే వంటకాలను ఆమె ఎంతగానో ఇష్టపడుతుందట. ఇక త్వరలోనే చైతన్యతో శోభిత వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి తర్వాత ఎలా ప్లాన్ చేసుకుంటుందో వేచి చూడాలి. కాగా.. గతంలో చైతు, శోభిత కాంబోలో ఒక్క సినిమా కూడా రూపొందలేదు. వీరు పెళ్లి తర్వాత అయినా కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇక శోభిత లుక్స్ తోను అక్కినేని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. కాగా ఈ ఏడాది డిసెంబర్ 4న వీళ్ళ వివాహం జరగనుందని సమాచారం.