‘గేమ్ ఛేంజ‌ర్‌’ కు అదే శ్రీరామ‌ర‌క్ష‌… కాపాడాల్సింది ఆ ఒక్క‌టి మాత్ర‌మే..?

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ మూడేళ్లుగా గేమ్ చేంజర్‌ సెట్స్‌కు స్టిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్, బన్నీ ముగ్గురు పాన్ ఇండియా స్టేజ్‌లో దూసుకుపోతున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పాన్ ఇండియన్ ట్రాక్ లోకి అడుగు పెట్టలేదు. కాగా గతంలో బన్నీ పుష్పా సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే చరణ్, ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్‌లు త‌మ ఖాత‌లో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన పాన్ ఇండియా ఇమేజ్‌ను మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దేవరతో ఆడియన్స్‌ను పలకరించి సక్సెస్ కూడా అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌కు సమస్య లేదన్నటంలో సందేహం లేదు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పూష పార్ట్ 2 కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలతో.. సినిమాకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇక మిగిలింది చరణ్. ఆర్ఆర్ఆర్ తో నార్త్‌ బెల్ట్‌లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చరణ్.. దానికి కొనసాగింపుగా గేమ్ ఛేంజ‌ర్‌తో బ్లాక్ బాస్టర్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌ తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేయ‌నున్నాఉ. కాగా బుచ్చిబాబుకు ఇప్పటివరకు అంత ఇమేజ్ లేదు. ఇలాంటి టైం లో గేమ్ చేంజర్‌తో హిట్ కొట్టి ఖ‌చ్చితంగా చరణ్ తనను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే క్రేజీ దర్శకుల దృష్టి చరణ్ పై పడుతుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి బర్లు రిలీజ్‌కానున్న‌ సంగతి తెలిసిందే.

అయితే బాలకృష్ణ – బాబి వీరుమాన్ సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో రాబిన్‌హుడ్‌లా పెద్ద గజ దొంగల కనిపించనున్నాడు. గుర్రాలు, దోపిడి దొంగల నేపథ్యంలో సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ హార్డ్‌ వర్క్.. గట్టిగానే ఉంటుంది. బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాలయ్య విజయానికి తోడు అవుతారని.. పేరుకే వీరు వేరు వేరు ఫ్యాన్స్. అయినా 70 శాతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాలయ్య అభిమానులు గానే ఉంటారు. ఈ క్రమంలోనే దేవర మాదిరి బాలయ్య సినిమాను బ్లాక్ బస్టర్ చేయడానికి నందమూరి ఫ్యాన్స్ గట్టి వర్క్ చేస్తారు.

ఇక ప్రస్తుతం మెగా ఫాన్స్ రాంచరణ్‌కు అడ్డుగోడ కట్టి.. వారి కాంపిటీషన్ను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మెగా ఫాన్స్ లో ఈ ఆర్గనైజేషన్ కనపడటం లేదు. బన్నీ, పవన అభిమానులు అంటూ రెండుగా చీలిపోయిన మెగా ఫాన్స్ బాలయ్య , ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాదిరిగా కలిసికట్టుగా వ్యవహరించడం అనేది సాధ్యం కాదు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజ‌ర్ ప్రచారానికి వెల్ ప్లాన్ చేస్తూ మెగా ఫ్యాన్స్ యూనిటీ.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక మెగా ఫ్యాన్సీ గేమ్ చేంజర్ కు శ్రీరామరక్ష. కాపాడాల్సింది కూడా మెగా అభిమానులే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.