‘చైతు -శోభితా’ వెడ్డింగ్‌పై సూప‌ర్ అప్‌డేట్ ఇది…!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ త్వ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రైవేట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. అభిమానులకు సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. పసుపు దంచుతూ ఈ వేడుక ఫోటోలను శోభిత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పిక్స్ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

Sobhita Dhulipala | Inside Sobhita Dhulipala and Naga Chaitanya's  engagement; fresh photos out - Telegraph India

అయితే తాజాగా చైతు, శోభిత‌ల‌ పెళ్లి వేడుక కోసం వేదిక ఫిక్స్ అయిందని.. వారిద్దరు పెళ్లి హైదరాబాద్ అన్న పూర్ణ స్టూడియోలోనే జరగబోతుంది అంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఈవెంట్ కోసం సెట్ ను రెడీ చేస్తున్నారట. ఇక వీళ‌ పెళ్లి డిసెంబర్ 4, 2024లో ఎటువంటి గ్రాండ్ హంగులు లేకుండా చాలా సింపుల్గా నిర్వహించనున్నారని సమాచారం. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు.. సన్నిహితులు, అతికొద్దిమంది బంధువులు మాత్రమే హాజరుకానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Naga Chaitanya and Sobhita Dhulipala's Engagement Highlights | Naga  Chaitanya and Sobhita Dhulipala's Engagement Highlights

ఇక ఈ జంట సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగచైతన్య తండేల్‌ సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో సాఫ్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించబోతున్నాడని సమాచారం. ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభిత 2013 లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లోను వరుస ఆఫర్లను అందుకుంటూ నటిస్తుంది. త్వరలోనే వీరి పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుందని వార్తలు వైరల్ అవడంతో.. అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.