సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్‌గా అడుగుపెట్టి ట్రెడిషనల్ బ్యూటీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు. అయితే కొంతకాలానికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆ ముద్దుగుమ్మలే హాట్ హాట్ గా తయారై గ్రామర్ ఫోటోషూట్లతో.. పొట్టి బట్టలతో దర్శనమిస్తూ కుర్ర కారును కవ్విస్తుంటారు. ఆ కోవాలోకే వస్తుంది టాలీవుడ్ బ్యూటీ మీరాజాస్మిన్. ఒకప్పుడు పద్ధతి మారుపేరుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ట్రెడిషనల్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కాగా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే హాట్ హాట్ లుక్స్ తో కవ్విస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎద అందాలు, తొడ భాగాలు కనిపించేలా ఎక్స్పోస్ చేస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. స్టైలిష్ సొగసులతో వయ్యారాలు వలకబోస్తుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ.. గతంలో హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో నటుడు పృథ్వీరాజ్ తో ప్రేమాయణం నడిపిందట. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని సమయానికి సడన్గా అనిల్ టైటస్‌ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇటీవల కాలంలో రీ ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకొని నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటుందని.. విడాకులు కూడా తీసుకుంది అంటూ పుకార్లు వైరల్ అవుతున్నాయి.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో మీరాజాస్మిన్ సలార్ నటుడు పృథ్వీరాజ్ తో పీకల్లోకి ప్రేమాయణం నడిపిందట. అతన్ని వివాహం కూడా చేసుకోవాలనుకుందట. వీరి మధ్యలో అప్పట్లో డేటింగ్ రూమర్లు కూడాతెగ వినిపించాయి. వీరి కాంబోలో చక్రం, స్వప్నకుడు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ పృథ్వీరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరాజాస్మిన్‌ను కోడలుగా యాక్సెప్ట్ చేయలేదట. కన్నవారి మాటలను కాదనలేక.. పృథ్వీరాజ్ మీరాజాస్మిన్‌కు బ్రేకప్ చెప్పి దూరమయ్యారని ఓ రూమర్ తెగ వైరల్ గా మారింది. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.