టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటౌన అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అఖిల్ కూడా ఒకరు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న అఖిల్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అఖిల్ పేరు ఇండస్ట్రీలో తెగ మారుమోగిపోతుంది. అఖిల్ బిజినెస్ మ్యాన్ కూతురు జైనబ్ రివిడ్జ్‌ను వివాహం చేసుకొనుండటమే దీనికి కారణం. అసలు ఎవరు గెస్ చేయలేని విధంగా అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ చేసుకునే ఆడియన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చాడు. అక్కినేని అఖిల్ త్వరలోనే ప్రముఖ బిజినెస్ మాన్ కూతురు జైనబ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ నాగార్జున అఫీషియల్‌గా వెల్లడించాడు.
గత కొంతకాలంగా వీళ్లిద్దరు ప్రేమాయణం నడుపుతున్నారని.. ముఖ్యంగా రాణా, మొహకా బజాజ్ పెళ్లి మూమెంట్ నుంచి వీరి ప్రేమ మొదలైందని నెటింట వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున మరో వారుసుడైన నాగచైతన్య పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ 4న సింపుల్గా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరు పెళ్లి ఒకే వేదికపై అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎకే రోజు జరగబోతుంది అంటూ వార్తలు వినిపించిన.. దానిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అఖిల్ పెళ్లి ఈ ఏడాదిలో ఉండదని.. దానికి ఇంకా సమయం ఉంది.. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరి పెళ్లికూడా చాలా సింపుల్ గా చేయాలని ఫ్యామిలీ డిసైడ్ అయ్యారట.
మొదట నాగార్జున, అమల.. వీళ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని భావించినా.. అఖిల్ మాత్రం సింపుల్ గా పెళ్లి చేసుకుంటామని జైనబ్ కూడా అలాగే వాళ్ళ పెళ్లి జరగాలని అనుకుంటుందని వారికి చెప్పి కన్విన్స్ చేశాడట. ఈ క్రమంలోనే అమలా, నాగార్జున అఖిల్‌కు నచ్చినట్లుగా సింపుల్ మ్యారేజ్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే.. మరో తాజా సెట్ వేసి వీళ్ళ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్‌కి మించిన లక్కీ ప్లేస్ మరొకటి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్.. ఇద్దరు అక్కినేని వారసుల పెళ్లి వార్తల విషయంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.