టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే డైరెక్టర్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా అంతే కీలకపాత్ర ఉంటుంది. సినిమాలో వచ్చే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటేనే సినిమాకు మంచి టాక్ వస్తుంది. లేదంటే సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి సక్సెస్ అందుకున్న డిఎస్పి ఎన్నో సినిమాలకు కీలక పాత్ర పోషించాడు. ఇక గత కొద్దిరోజులుగా పుష్ప 2 విషయంలో కాంట్రవర్సీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో డిఎస్పి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ పై విపరీతమైన కోపంతో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
దానికి తగ్గట్టుగానే దేవి రీసెంట్గా ఈవెంట్లో వారిపై సెటైరికల్ కౌంటర్లు కూడా వేశాడు. ఏదేమైనా వీళ్ళ మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమై ఉంటుందని ఆసక్తి ఎంతో మంది అభిమానుల్లో నెలకొంది. అయితే డిఎస్పి పుష్ప 2 సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ఈ సినిమాపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడని.. తొందర్లోనే రిలీజ్ కు సిద్ధమవుతున్న మరో సినిమాపై ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన డిఎస్పి.. ఆ మూవీలోని ఓ సాంగ్ రిలీజ్ కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడని.. దీంతో పుష్ప 2 సినిమాకు ఇవ్వాల్సిన టైం పై నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం.
అందుకే.. దేవి ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి తీసుకువచ్చారట. అలా డిఎస్పి మైత్రి మూవీ మేకర్స్ మధ్యన వివాదాలు ఏర్పడ్డాయని తెలిసింది. అయితే ఈ వివాదాలన్నిటికీ కారణం అక్కినేని వారసుడు నాగచైతన్య అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నాగచైతన్య నటించిన తండేల్ సినిమా నుంచి తమకు అర్జెంటుగా సాంగ్ చేయాలని డిఎస్పి ని పోర్స్ చేశారట తండేల్ మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ కోసం ఈ సాంగ్ అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేవి ఆ సాంగ్ పై కాన్సన్ట్రేషన్ పెట్టి పుష్పను నిర్లక్ష్యం చేశాడని.. దీని కారణంగానే వీరిద్దరి మధ్యన తగాదాలు తలెత్తాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.