టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ కుటుంబంలో.. త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, అఖిల్ మరి కొద్ది రోజుల్లో తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా ఇదే ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్ గా జరగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే నాగచైతన్య, అఖిల్ పెళ్లి ఒకే వేదికపై జరగబోతున్నాయంటూ వార్తలు వినిపించినా.. దానికి నాగార్జున చెక్ పెట్టారు.
ఈ వార్తలు పై క్లారిటీ ఇస్తూ.. అఖిల్ పెళ్లికి ఇంకా సమయం ఉంది వచ్చే ఏడాదిలో అఖిల్ పెళ్లి జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా అక్కినేని ఇంట వరస శుభకార్యాలు జరగనున్న ఇలాంటి టైంలో అమల చేసిన ఓ పని నాగచైతన్య ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎంతైనా సవితి తల్లి అనిపించుకుందంటూ.. అఖిల్‌ని ఎకలా.. నాగచైతన్యను ఒకలా మొదటి అమల చూస్తుందంటూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ నాగచైతన్య ఫ్యాన్స్ అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటో.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం . నాగచైతన్య – శోభితను ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ కొత్త జంటకు విషెస్ తెలియజేశారు. అయితే ఈ విషయంలో అమల మాత్రం.. తన అభిమానులతో పంచుకోలేదు.
నిజానికి అమలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు కనుక.. ఎవరు దానిని పెద్దగా లెక్క చేయలేదు. కానీ.. ఇటీవల తన సొంత కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జైనబ్ రావిడ్జ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అఖిల్. ఈ క్రమంలో.. అమలా తన అధికార సోషల్ మీడియా వేదికగా అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ జంటకు విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం అమల చేసిన ఈ పని నెటింట హాట్ టాపిక్ గా మారింది. సొంత కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమల.. సవతి కొడుకని నాగచైతన్య పట్ల ఇంత వివక్షత చూపించిందంటూ.. నాగచైతన్య పట్ల ఆమెకు కాస్త కూడా ఎఫెక్షన్ లేదంటూ ఫైర్ అవుతున్నారు. అందుకే తన ఎంగేజ్మెంట్‌కు కనీసం విషెస్ తెలియజేయలేదని.. అమల, నాగచైతన్యను కొడుకుగా ఇప్పటికీ అంగీకరించలేక పోతుందనడానికి ఇదే ఆధారం అంటూ.. సోషల్ మీడియా వేదికగా అమలపై ఫైర్ అవుతున్నారు.